Pant: దంత వైద్యుడి వద్దకెళ్లడమే కారణమా?

తాజా వార్తలు

Updated : 16/07/2021 13:28 IST

Pant: దంత వైద్యుడి వద్దకెళ్లడమే కారణమా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసలు రిషభ్‌ పంత్‌కు కరోనా ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? యూరో ఛాంపియన్‌షిప్‌ మ్యాచులకు వెళ్లడమే కారణమా? అక్కడ మాస్క్‌ లేకుండా అభిమానులతో చిత్రాలు దిగడమే కొంప ముంచిందా? ఇవి కాకుండా ఇంకేదైనా కారణముందా?

టీమ్‌ఇండియా యువ వికెట్‌కీపర్‌కు కరోనా రావడానికి మరొక కారణం ఉందని సమాచారం అందుతోంది. అతడు దంత వైద్యుడిని కలవడం వల్లే వైరస్‌ సోకినట్టు తెలుస్తోంది. ఎక్కడ? ఎలా? డెల్టా వేరియెంట్‌ సోకిందో చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు ఎవరిదగ్గరా లేవు. బహుశా ఈ మార్గంలోనే వైరస్‌ వచ్చిందని జట్టు వర్గాలు భావిస్తున్నాయని అంటున్నారు.

నిజానికి పంత్‌ జూన్‌ 29న వెంబ్లీ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాడు. జులై 8న పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయం 15వ తేదీన మీడియాకు తెలిసింది. కానీ జులై 5, 6 తేదీల్లో అతడు దంత వైద్యుడి దగ్గరకి వెళ్లాడు. 7వ తేదీన రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ రావడం గమనార్హం. ‘అవును, పంత్‌ జులై 5, 6 తేదీల్లో దంత వైద్యుడి వద్దకు వెళ్లాడు. బహుశా వైద్యశాలలోనే అతడికి వైరస్‌ సోకి ఉండొచ్చు. జులై 7న అతడు టీకా వేయించుకున్నాడు’ అని అక్కడి వర్గాలు అంటున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని