Rohit sharma: సెలవులు ఖతం.. ఇక పని షురూ!

తాజా వార్తలు

Updated : 17/07/2021 13:26 IST

Rohit sharma: సెలవులు ఖతం.. ఇక పని షురూ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోహ్లీసేనకు సెలవులు ముగిశాయి. విహార యాత్రలు ముగించుకొన్న ఆటగాళ్లంతా డుర్హమ్‌ చేరుకున్నారు. రివర్‌సైడ్‌ స్టేడియంలో సాధన మొదలు పెట్టారు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు సిద్ధమవుతున్నారు.

క్రికెటర్లంతా తిరిగి ఒక్క చోటకు చేరడంతో టీమ్‌ఇండియా శిబిరం సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా సోషల్‌  మీడియాకు పని చెప్పారు. తమ శిక్షణ మొదలైందంటూ చిత్రాలు పంచుకున్నారు.

‘మిత్రమా.. సెలవులు ముగిశాయి. ఇక పని మొదలు పెట్టాలి’ అని టీమ్‌ఇండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. చిరునవ్వులు చిందిస్తున్న చిత్రాలను పంచుకున్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం ‘తిరిగి శిబిరానికి చేరుకున్నాం’ అని అన్నాడు. కేఎల్‌ రాహుల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌తో కలిసిన ఫొటో పెట్టాడు. ‘హలో డుర్హమ్‌.. ఇక్కడికి రావడం బాగుంది’ అని బీసీసీఐ పెట్టింది.

రిషభ్ పంత్‌కు కరోనా సోకడంతో అతడు శిబిరానికి రాలేదు. నిబంధనల కారణంగా పంత్‌తో సన్నిహితంగా మెలిగిన వృద్ధిమాన్‌ సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ సైతం రాలేదు. మరో పది రోజుల తర్వాత వీరంతా అక్కడికి చేరుకోనున్నారు.






Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని