Ronaldo - Messi:మెస్సీని దాటిన రొనాల్డో

తాజా వార్తలు

Published : 23/09/2021 11:31 IST

Ronaldo - Messi:మెస్సీని దాటిన రొనాల్డో

దిల్లీ: ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు లియొనాల్‌ మెస్సీని.. మరో అగ్రశ్రేణి క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో దాటాడు. కానీ ఇది మైదానంలోనో, ఆటకు సంబంధించిన రికార్డుల్లోనో కాదు. ఆదాయంలో.. అవును ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు జాబితాలో ఈ ఏడాదికి గాను రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్‌ ప్రకటించిన ఈ జాబితాలో మెస్సి రెండో స్థానం దక్కించుకున్నాడు. తిరిగి మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు మారడంతో ఆదాయం విషయంలో రొనాల్డో మెస్సీని వెనక్కినెట్టాడు. 2021-22 సీజన్‌కు రొనాల్డో సుమారు   రూ.922 కోట్లు ఆదాయం పొందుతున్నట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది. మెస్సి ఆదాయం రూ.812 కోట్లు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని