Team India: టీమ్‌ఇండియాభవిష్యత్తు కెప్టెన్‌ పేరు సూచించిన గావస్కర్

తాజా వార్తలు

Published : 17/09/2021 09:58 IST

Team India: టీమ్‌ఇండియాభవిష్యత్తు కెప్టెన్‌ పేరు సూచించిన గావస్కర్

దిల్లీ: కేల్‌ రాహుల్‌లో నాయకత్వ లక్షణాలున్నాయని, భవిష్యత్తు కెప్టెన్‌గా అతణ్ని ప్రోత్సహించాలని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. కోహ్లి టీ20 సారథిగా వైదొలగిన నేపథ్యలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ భవిష్యత్తుపై దృష్టిపెట్టడం మంచి విషయం. భారత్‌ ఓ కొత్త కెప్టెన్‌ను తయారు చేయాలనుకుంటే రాహుల్‌పై దృష్టి పెడితే మంచిది. ఇంగ్లాండ్‌తో అతడు చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతణ్ని వైస్‌ కెప్టెన్‌ను చేయొచ్చు’’ అని గావస్కర్‌ అన్నాడు. రాహుల్‌.. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘రాహుల్‌ ఐపీఎల్‌లో తన నాయకత్వంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్‌ దెబ్బతినకుండా చూసుకున్నాడు’’ అని గావస్కర్‌ చెప్పాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని