Suresh Raina: ధోనీ కోసం మరోసారి..!
close

తాజా వార్తలు

Published : 21/07/2021 01:06 IST

Suresh Raina: ధోనీ కోసం మరోసారి..!

ఐపీఎల్‌ గెలుస్తామన్న చిన్న తలా

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేంద్రసింగ్‌ ధోనీ కోసం మరోసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలుస్తామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అన్నాడు. అలా చేస్తే మరో రెండు మూడేళ్లు మహీ లీగులో కొనసాగేందుకు అవకాశం ఉంటుందన్నాడు. జట్టులో ఆటగాళ్లకు అతడెంతో స్వేచ్ఛనిస్తాడని గుర్తు చేసుకున్నాడు.

‘దుబాయ్‌ వెళ్లగానే మాకోసం శిబిరం ఏర్పాటవుతుంది. మేం మరోసారి ధోనీ కోసం టైటిల్‌ గెలుస్తాం. ఈ సీజన్లో మా ఆటతీరు, మహీ సారథ్యం వల్ల అదనపు ఆత్మవిశ్వాసం లభించింది. మేమందరం మా విజయాలను ఆస్వాదిస్తున్నాం’ అని రైనా అన్నాడు.

ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొచ్చేందుకు ధోనీ స్వేచ్ఛనిస్తాడని రైనా తెలిపాడు. ‘మహీ అందరికీ స్వేచ్ఛనిస్తాడు. ఇక మా జట్టులో మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, డ్వేన్‌ బ్రావో, రుతురాజ్‌ ఉన్నారు. మేం జోరుమీదున్నాం. ధోనీ కోసం మరోసారి టైటిల్‌ గెలుస్తామనే ధీమా ఉంది. నేను అతడి నుంచి ఎంతో నేర్చుకున్నా. అతడు నాకు సోదరుడు’ అని వెల్లడించాడు.

ధోనీ, రైనా అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో వీరి మధ్య సోదర బంధం మరింత బలపడింది. అందుకే మహీ వీడ్కోలు పలకగానే రైనా సైతం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ సీజన్‌ గడిచాక ధోనీ ఆడకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నా.. వాటిని సీఎస్‌కే, రైనా కొట్టిపారేయడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని