పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేత శరద్‌కుమార్‌కు అస్వస్థత

తాజా వార్తలు

Published : 23/09/2021 15:33 IST

పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేత శరద్‌కుమార్‌కు అస్వస్థత

(Photo: Sharad Kumar Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేత శరద్‌ కుమార్‌ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవలే అతడికి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే అతడిని పరీక్షించిన వైద్యులు గుండె వాపు (Heart Swelling) సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఓ వార్తా సంస్థకు తెలిపాడు. అసలేం జరిగిందో తనకు తెలియదని, తన వైద్య నివేదికల్లో గుండెలో వాపు ఉందని తేలిందన్నాడు. దీంతో తనకు ఛాతిలో నొప్పి వస్తున్నట్లు పేర్కొన్నాడు. వైద్య పరీక్షలతో విసుగెత్తిపోయానని, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ తరచూ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నానని శరద్‌ వివరించాడు.

మరోవైపు పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్ ఈవెంట్‌లో తాను కాంస్య పతకం సాధించకముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడినట్లు తెలిపాడు. ఫైనల్‌ ఈవెంట్‌కు ముందు తన కాలికి గాయమైందని, దీంతో ఆ రాత్రంతా నిద్రపోలేదని వివరించాడు. ఉదయం తన సోదరుడితో మాట్లాడితే ఏం జరిగినా పోటీల్లో పాల్గొనమని చెప్పాడని, ఈ క్రమంలోనే తాను కాంస్య పతకం సాధించానని పేర్కొన్నాడు. కాగా, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఇతర అథ్లెట్లు.. షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌, షూటర్‌ మనీష్‌ నర్వాల్, జావెలిన్‌ త్రోవర్‌ సుందర్‌ సింగ్‌ గుర్జార్‌తో పాటు శరద్‌ను కూడా పారాలింపిక్స్‌ కమిటి ఆఫ్‌ ఇండియా ఈ ఏడాది మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సులు చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని