Virat Kohli: టీ-20 కెప్టెన్సీపై  విరాట్‌ కోహ్లి కీలక నిర్ణయం

తాజా వార్తలు

Updated : 16/09/2021 18:27 IST

Virat Kohli: టీ-20 కెప్టెన్సీపై  విరాట్‌ కోహ్లి కీలక నిర్ణయం

హైదరాబాద్‌: టీ20 జట్టు కెప్టెన్‌గా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తప్పుకోనున్నారు. టీ20 ప్రపంచ కప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. ‘‘ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నా. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నా. పని ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసున్నా’’ అని కోహ్లి ట్విటర్‌ వేదికగా   వెల్లడించారు. టెస్టు, వన్డే జట్లకు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగనున్నారు. టీ20 జట్టులో బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతానని కోహ్లి స్పష్టం చేశారు. గంగూలీ, రవిశాస్త్రి, రోహిత్‌శర్మలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని విరాట్‌ వివరించారు. కోహ్లీ వైదొలగిన తర్వాత టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌శర్మ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని క్రీడానిపుణులు భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని