Virat Kohli: కోహ్లీ చెప్పిన మాటలు నిజమే.. కష్టానికి సాటి ఏదీ లేదు

తాజా వార్తలు

Published : 25/08/2021 01:44 IST

Virat Kohli: కోహ్లీ చెప్పిన మాటలు నిజమే.. కష్టానికి సాటి ఏదీ లేదు

(Photo: Virat Kohli Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి చేతలలాగే మాటలు కూడా స్పష్టంగా ఉంటాయి. తాజాగా కోహ్లీ లీడ్స్‌ మైదాన ప్రాంగణంలోని జిమ్‌లో అధిక బరువులు ఎత్తుతూ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పంచుకున్నాడు. దానికి ‘కష్టానికి సాటి ఏదీ లేదు’ అంటూ వ్యాఖ్యానం జతచేశాడు.

ఒలింపిక్స్‌లో అథ్లెట్లు వెయిట్‌లిఫ్టింగ్‌ చేసేలా కోహ్లీ తన వ్యాయామం పూర్తి చేశాడు. కాగా, తనలాగే జట్టు సభ్యులు కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని కెప్టెన్‌ ఎప్పుడూ కోరుకుంటాడు. ఈ క్రమంలోనే అతడు సారథిగా మారినప్పటి నుంచి జట్టు సభ్యులు కూడా శారీరకంగా దృఢంగా తయారవుతున్నారు. కోహ్లీ కఠోర సాధన ఎలా ఉంటుందో మీరూ ఒక లుక్కేయండి.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని