Virat Kohli: ఈ 60 ఓవర్లు ఆంగ్లేయులకు నరకం కనిపించాలి! జట్టుకు కోహ్లీ సందేశం!

తాజా వార్తలు

Updated : 18/08/2021 15:22 IST

Virat Kohli: ఈ 60 ఓవర్లు ఆంగ్లేయులకు నరకం కనిపించాలి! జట్టుకు కోహ్లీ సందేశం!

271 పరుగుల లక్ష్యం.. 60 ఓవర్లు.. 10 వికెట్లు.. సమీకరణం చూస్తుంటే ఏమనిపిస్తోంది? తలపడుతున్న రెండు జట్లకు విజయం అంత సులభమేమీ కాదనే అనిపిస్తుంది! టెస్టు డ్రా అయ్యేందుకే అవకాశాలు అధికం. అలాంటి స్థితిలో టీమ్‌ఇండియా అద్భుతమే చేసింది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. నిజానికి ఇదెలా సాధ్యమైంది? ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చిందెవరు? వారిలో ప్రేరణ నింపిందెవరు?

అంటే.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయే అని అంటున్నారు చాలామంది! ఆఖరి రోజు భోజన విరామం తర్వాత టీమ్‌ఇండియా ఒక ఓవర్‌ మొత్తమైనా ఆడలేదు. మధ్యలోనే విరాట్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను మానసికంగా దెబ్బకొట్టాడు. అంతేకాకుండా ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి వచ్చిన తర్వాత జట్టు ఆటగాళ్ల రోమాలు నిక్కబొడిచేలా మాట్లాడాడని తెలిసింది. ‘ఈ 60 ఓవర్లలో ఇంగ్లాండ్‌కు నరకం చూపించాలి’ అని ప్రేరణ నింపాడట.

‘మనం వారిని ఔట్‌ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. కానీ, ఈ 60 ఓవర్లు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ నరకంలో ఉన్నట్టు భావించాలి’ అని టీమ్‌ఇండియా బౌలర్లకు విరాట్‌ కోహ్లీ చెప్పాడని తెలిసింది. ‘ఆ ఆటగాళ్ల ముందు ఎవరైనా నవ్వడం చూశానో.. ఏం జరుగుతుందో చూడండి. అర్థమైందా? ఈ 60 ఓవర్లు నరకంగా అనిపించాలి’ అని ఆటగాళ్లకు చెప్పాడని డైలీ మెయిల్‌ తెలిపింది. దీంతో 52 ఓవర్లకే ఇంగ్లాండ్‌ జట్టును భారత బౌలర్లు పెవిలియన్‌ పంపించేసి ఘన విజయం అందించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని