Pakistan Cricket:మనం బాగా ఆడితే.. వాళ్లే వస్తారు: వసీమ్‌ అక్రమ్

తాజా వార్తలు

Published : 29/09/2021 02:12 IST

Pakistan Cricket:మనం బాగా ఆడితే.. వాళ్లే వస్తారు: వసీమ్‌ అక్రమ్

దిల్లీ: సంక్షోభ సమయంలో జాతీయ జట్టుకు అండగా నిలవాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులను దిగ్గజ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌ కోరాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ జట్లు పాక్‌ పర్యటలను రద్దు చేసుకోవడంతో అందరిలాగే తానూ నిరాశ చెందానని చెప్పాడు. ‘‘న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ జట్లు పాకిస్థాన్‌ పర్యటనలను రద్దు చేసుకోవడం మీకు నిరాశ కలిగించిందని నాకు తెలుసు. నేనూ మీలాగే బాధపడ్డా, నిరాశ చెందా. కానీ ఏదేమైనా జీవితం ముందుకు సాగాల్సిందే. మన ఛైర్మన్‌ రమీజ్‌ రాజా చెప్పినట్లు.. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టుకు మద్దతిద్దాం’’ అని అక్రమ్‌ అన్నాడు. ‘‘పర్యటనలను రద్దు చేసుకున్నందుకు వాళ్లను తర్వాత విమర్శిద్దాం. పరిష్కారాలను కనుగొందాం. కానీ ఇప్పుడు మాత్రం.. మనమంతా ఒక్కటై మన జట్టుకు మద్దతుగా నిలవాలి. ఒకవేళ జట్లు మన దేశానికి రావొద్దనుకుంటే రాకపోనీయండి. కానీ మన జట్టు ప్రపంచవ్యాప్తంగా బాగా ఆడితే.. జట్లు వాటంతటవే పాకిస్థాన్‌కు వస్తాయి’’ అని చెప్పాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని