Tokyo Olympics: ఇక ‘పసిడి’ పట్టే.. భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన కుస్తీవీరుడు రవి

తాజా వార్తలు

Updated : 04/08/2021 22:21 IST

Tokyo Olympics: ఇక ‘పసిడి’ పట్టే.. భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన కుస్తీవీరుడు రవి

తొమ్మిదేళ్ల తర్వాత రెజ్లింగ్‌లో ఫైనల్‌కు భారత రెజ్లర్‌

టోక్యో: భారత రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకున్నాడు. భారత్‌కు మరో పతకం ఖాయం చేశాడు. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయిస్తున్న వేళ.. అనూహ్యంగా పుంజుకున్న రవి ‘విక్టరీ బై ఫాల్‌’ పద్ధతిలో స్వర్ణ పోరుకు అర్హత సాధించాడు. 7-9 తేడాతో కజక్‌స్థాన్‌ కుస్తీవీరుడు సనయెవ్‌ నురిస్లామ్‌ను ఓడించాడు.

తొలి రెండు మ్యాచుల్లో ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలు అందుకున్న రవికి సెమీస్‌లో కఠిన పరీక్షే ఎదురైంది. నురిస్లామ్‌ మొత్తంగా ఆధిపత్యం చెలాయించాడు. తొలుత రిఫరీ నిర్దేశించి 30 సెకన్లలో రవి పాయింటు తేకపోవడంతో ప్రత్యర్థి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అంతలోనే పుంజుకున్న రవి ప్రత్యర్థిని పడగొట్టి 2 పాయింట్లు అందుకున్నాడు. 2-1తో మొదటి పిరియడ్‌ను ముగించాడు.

ఇక కీలకమైన రెండో పిరియడ్‌లో రవి రెండు కాళ్లను ఒడిసిపట్టిన నురిస్లామ్‌ అతడిని మెలికలు తిరిగేలా చేశాడు. దాంతో వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు సాధించాడు. 9-2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇక రవి గెలవడం కష్టమేనన్న పరిస్థితి తలెత్తింది. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ప్రత్యర్థిపై దూకుడుగా ఆడిన రవి 1, 2 ,2 పాయింట్లతో స్కోరును 7-9కి తగ్గించాడు. అప్పుడే నురిస్లామ్‌ గాయపడటం రవికి కలిసొచ్చింది. ఇదే అదనుగా అతడిని పడగొట్టిన రవి.. పూర్తిగా 30 సెకన్లపాటు లేవకుండా రింగులోనే అడ్డుకోగలిగాడు. విక్టరీ బై ఫాల్‌ పద్ధతిలో ఫైనల్‌కు చేరుకున్నాడు. అఖండ భారతావనిని మురిపించాడు.

భారత్‌ నుంచి రెజ్లింగ్‌లో ఫైనల్‌ చేరిన రెండో ఆటగాడు రవి కుమార్‌. అంతకు ముందు సుశీల్‌ కుమార్‌ 2008 బీజింగ్‌లో కాంస్యం గెలిచాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకొని రజతంతో మురిపించాడు. 2012లో యోగేశ్వర్‌ కాంస్యం గెలిచాడు. తొమ్మిదేళ్ల తర్వాత రవి రూపంలో భారత రెజ్లర్‌ ఫైనల్‌ చేరడం ప్రత్యేకం.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని