Tokyo olympics: రెజ్లర్‌ సీమా బిస్లా ఓటమి

తాజా వార్తలు

Published : 06/08/2021 08:33 IST

Tokyo olympics: రెజ్లర్‌ సీమా బిస్లా ఓటమి

టోక్యో: రెజ్లింగ్‌లో మహిళలు నిరాశ పరుస్తున్నారు. 50 కిలోల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో సీమా బిస్లా ఓటమి పాలైంది. ట్యునీషియాకు చెందిన హమ్దీ సర్రా 3-1 తేడాతో ఆమెను ఓడించింది. మ్యాచులో వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. మొదటి పిరియడ్‌లో సీమకు పాయింట్లేమీ రాలేదు. ప్రత్యర్థి సైతం ఒక పాయింటే అందుకుంది. ఇక రెండో పిరియడ్‌లో ఇద్దరూ ఉండుం పట్టు పట్టారు. సీమకు ఒక పాయింటు లభించింది. అయితే ప్రత్యర్థికి మరో 2 పాయింట్లు రావడంతో భారత రెజ్లర్‌కు ఓటమి తప్పలేదు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని