Cricket: ‘డెప్త్‌’ రారాజు.. భారత్‌, ఇంగ్లాండ్‌ భేష్‌

తాజా వార్తలు

Updated : 19/07/2021 04:29 IST

Cricket: ‘డెప్త్‌’ రారాజు.. భారత్‌, ఇంగ్లాండ్‌ భేష్‌

దిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో క్రికెట్‌ జట్లకు ‘డెప్త్‌’ విలువైందిగా మారిందని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అన్నారు. ఈ విషయంలో ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్‌, ఇంగ్లాండ్‌ మెరుగైన స్థితిలో ఉన్నాయన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లో డెప్త్‌ ఉంటే మంచిదని వెల్లడించారు.

‘ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టును ఓడించి ఫాస్ట్‌ బౌలింగ్‌లో టీమ్‌ఇండియా తన డెప్త్‌ బలమేంటో ప్రదర్శించింది. రెండో టెస్టులో ఆరు మార్పులు చేసి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్‌ సునాయాసంగా ఓడించింది. తమ ప్రతిభతో ఆశ్చర్య పరిచింది’ అని ఛాపెల్‌ అన్నారు.

పాకిస్థాన్‌తో వన్డే సిరీసులోనూ ఇంగ్లాండ్‌ ఇలాగే చేసిందని ఛాపెల్‌ తెలిపారు. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిందన్నారు. సాఖిబ్‌ మహమూద్‌, బ్రైడన్‌ కేర్స్‌ పేస్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారని ప్రశంసించారు. ఆసీస్‌లో జరిగే యాషెస్‌కు పోటీలో ఉన్నారని వెల్లడించారు. ఇక బ్యాటింగ్‌ డెప్త్‌ పరంగానూ ప్రపంచంలో టీమ్‌ఇండియానే అత్యుత్తమంగా ఉందన్నారు.

‘అన్ని జట్ల కన్నా టీమ్‌ఇండియానే బాగుంది. వారి అభివృద్ధి వ్యవస్థ సంప్రదాయ టెక్నిక్స్‌తో మెరుగైన ఆటగాళ్లను రూపొందిస్తోంది. ఫస్ట్‌క్లాస్‌ స్థాయిలో ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది. అయితే, ఇంగ్లాండ్‌ సిరీసులో కోహ్లీసేన డెప్త్‌కు పరీక్ష ఎదురవ్వనుంది. ఎందుకంటే ఐసోలేషన్‌ నిబంధనలు పాటించాలి. పైగా సన్నాహక మ్యాచులేం లేవు. ఇలాంటప్పుడే ఆధునిక క్రికెట్లో డెప్త్‌ రారాజుగా మారుతోంది’ అని ఛాపెల్‌ అన్నారు.

ఆస్ట్రేలియా ఎక్కువ మంది ఫాస్ట్‌ బౌలర్లను తయారు చేస్తున్నా బ్యాటింగ్‌ డెప్త్‌ పెంచుకోవడం లేదని ఛాపెల్‌ తెలిపారు. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ లేకుంటే పరిస్థితి మరీ దారుణంగా మారుతోందని విమర్శించారు. కరీబియన్‌ పర్యటనలో ఈ విషయం వెల్లడైందన్నారు. మిచెల్‌ మార్ష్‌ మినహా మరెవ్వరూ రాణించలేదని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని