పెరీరా.. ఆరు బంతులు.. ఆరు సిక్స్‌లు
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 21:45 IST

పెరీరా.. ఆరు బంతులు.. ఆరు సిక్స్‌లు

కొలంబో: శ్రీలంక ఆల్‌ రౌండర్‌ తిసార పెరీరా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

అక్కడి దేశవాళీ మ్యాచ్‌లో భాగంగా శ్రీలంక ఆర్మీ టీమ్‌ vs బ్లూమ్‌ ఫీల్డ్‌ క్రికెట్‌ మధ్య పనగోడ పట్టణంలో ఈ మ్యాచ్‌ జరిగింది. 13 బంతుల్లో 52 పరుగులు చేసిన తిసార పెరీరా అందులో 8 సిక్స్‌లు ఉన్నాయి. శ్రీలంక ఏ-క్రికెట్‌లో అత్యంత వేగంగా అర్ధశతకాన్ని నమోదు చేసిన రెండో ఆటగాడిగానూ పెరీరా రికార్డు సృష్టించాడు. గతంలో కౌశల్య వీర రతనే 12 బంతుల్లో  హాఫ్‌ సెంచరీ చేశాడు. పెరీరా తన కెరీర్‌లో 6 టెస్టులు, 166 వన్డేలు, 64 టీ20లు ఆడాడు.

ఇప్పటివరకూ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లు: సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌, రవి శాస్త్రి, గిబ్స్‌, యువరాజ్‌ సింగ్‌, రాస్‌ వైట్లే, హజ్రతుల్లా జాజాయ్‌, లీయో కార్టర్‌, కీరన్‌ పోలార్డ్‌లు ఈ ఘనత సాధించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని