జస్ప్రీత్‌ బుమ్రాపై నెటిజెన్ల ‘ఫైర్‌’

తాజా వార్తలు

Updated : 20/03/2021 14:14 IST

జస్ప్రీత్‌ బుమ్రాపై నెటిజెన్ల ‘ఫైర్‌’

(Photo: Jasprit Bumrah Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై పలువురు నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం అతడు పంచుకున్న పెళ్లి ఫొటోలే. బుమ్రా ఈనెల 15న ఓ క్రీడా ఛానల్‌ వ్యాఖ్యాత సంజన గణేశన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవాలో ఈ వేడుక జరిగింది. ఏడడుగులు వేసే వరకూ ఈ విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచిన బుమ్రా తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే సంజనతో కలిసి వివాహ వేడుక సమయంలో తీసుకున్న మరో రెండు ఫొటోలను శుక్రవారం బుమ్రా ట్విటర్‌లో పోస్టు చేశాడు. గతకొన్ని రోజులుగా తన జీవితం అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే తమ దంపతులను దీవించిన, శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. అయితే, బుమ్రా పంచుకున్న ఫొటోల్లో బాణసంచా కాల్చడం కనిపించడంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బుమ్రా గతంలో ఓసారి దీపావళి రోజున టపాసులు కాల్చొద్దని అభిమానులను కోరుతూ ట్వీట్‌ చేశాడు. 2017లో బుమ్రా చేసిన ట్వీట్‌ను ఇప్పుడు నెటిజెన్లు షేర్‌ చేస్తూ అతడిపై మండిపడుతున్నారు. ‘మొదట మీరు పాటించి తర్వాత ఇతరులకు చెప్పండి’, ‘భాయ్‌.. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు’ అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని