ధోనీసేనను పరుగు తేడాతో ఓడించిన వేళ..

తాజా వార్తలు

Published : 12/05/2021 13:46 IST

ధోనీసేనను పరుగు తేడాతో ఓడించిన వేళ..

ముంబయి నాలుగో ట్రోఫీ గెలిచి రెండేళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌.. చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు. అప్పటికే చెరో మూడు ట్రోఫీలతో సమానంగా ఉన్నాయి. నాలుగో టైటిల్‌ కోసం 2019 ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డాయి. అత్యల్ప స్కోర్లు నమోదైన ఈ పోరులో రోహిత్‌ బృందం పరుగు తేడాతో ధోనీ సేనను ఓడించింది. ఆ జట్టు నాలుగో ట్రోఫీని ముద్దాడి నేటికి (2021, మే 12) సరిగ్గా రెండేళ్లు.

పొలార్డ్‌ మెరుపులు

హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ముంబయి మొదట బ్యాటింగ్‌ చేసింది. దీపక్‌ చాహర్‌ (3/26), శార్దూల్‌ ఠాకూర్‌ (2/37), ఇమ్రాన్‌ తాహిర్‌ (2/23) అద్భుత బౌలింగ్‌తో రోహిత్‌ సేనను 149/8కే పరిమితం చేశారు. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (28), ఇషాన్‌ కిషన్‌ (23) ఫర్వాలేదనిపించారు. కానీ ముంబయికి కాపాడుకోగల స్కోరు అందించింది మాత్రం కీరన్‌ పొలార్డ్‌ (41; 25 బంతుల్లో 3×4, 3×6). ఇతరులు విఫలమవుతున్న వేళ అతడు భారీ షాట్లు ఆడాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

బౌలర్ల కట్టడి

స్వల్ప ఛేదనకు దిగిన ధోనీ సేనను బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (1/14) భారీ దెబ్బకొట్టారు. 148/7కు పరిమితం చేశారు. వాట్సన్స్‌ (80; 59 బంతుల్లో 8×4, 4×6) మెరిసినా.. మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం అందనివ్వలేదు. రాహుల్‌ చాహర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. పిచ్‌ నుంచి అందుతున్న సహకారంతో సరైన లెంగ్తుల్లో కట్టుదిట్టంగా బంతులేసి పరుగులు చేయనివ్వలేదు. ఎప్పటిలాగే బుమ్రా 17, 19 ఓవర్లలో మాయాజాలం ప్రదర్శించాడు. 17వ ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. చెన్నై 12 బంతుల్లో 18 చేయాల్సి ఉండగా.. 19వ ఓవర్లో 9 పరుగులిచ్చి డ్వేన్‌ బ్రావోను ఔట్‌ చేశాడు. మలింగ వేసిన ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా 4వ బంతికి వాట్సన్‌ రనౌట్‌ అయ్యాడు. ఆఖరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ ఔటవ్వడంతో పరుగు తేడాతో ముంబయి విజేతగా ఆవిర్భవించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని