తండ్రైన క్రికెటర్‌ ఉమేశ్‌ యాదవ్‌
close

తాజా వార్తలు

Published : 02/01/2021 00:47 IST

తండ్రైన క్రికెటర్‌ ఉమేశ్‌ యాదవ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ తండ్రయ్యాడు. అతడి సతీమణి తాన్యా వధ్వా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఉమేశ్‌ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ‘ఈ ప్రపంచానికి స్వాగతం.. చిన్నారి రాకుమారి! నువ్వొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్య జత చేశాడు. పంజాబ్‌కు చెందిన తాన్యా, ఉమేశ్‌ ప్రేమించుకొన్నారు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారికిప్పుడు సంతానం కలిగింది.

కెరీర్‌ విషయానికి వస్తే ఉమేశ్‌ భారత్‌కు వచ్చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అతడి ఎడమకాలి పిక్క కండరాలకు గాయమైంది. చక్కని లైన్‌, లెంగ్త్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 3.3 ఓవర్లు విసిరి ఒక వికెట్‌ తీశాడు. నాలుగో ఓవర్‌లో మూడు బంతులు విసరగానే అతడు ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి పరీక్షించి డ్రెస్సింగ్‌ రూమ్‌కు‌ తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడు బౌలింగ్‌ చేయడానికి రాలేదు. కోలుకొనేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలియడంతో భారత్‌కు పంపించారు. అతడి స్థానంలో నటరాజన్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి
కోహ్లీసేన.. 2021లో మారాలిక!
మానసిక ఇబ్బందుల్లో స్మిత్‌..!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని