T20 India Captain: అతడే భారత టీ20 కెప్టెన్‌గా అర్హుడు:వెంగ్‌ సర్కార్‌

తాజా వార్తలు

Published : 18/09/2021 01:12 IST

T20 India Captain: అతడే భారత టీ20 కెప్టెన్‌గా అర్హుడు:వెంగ్‌ సర్కార్‌

(Photo: Rohit Sharma Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: యూఏఈ వేదికగా అక్టోబర్‌లో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్‌గా తప్పుకొంటున్న విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.  దీంతో ఈ ఫార్మాట్‌లో తదుపరి కెప్టెన్‌గా ఎవరి ఎంపిక చేస్తారనే దానిపై చర్చ ఊపందుకొంది. ఈ విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మను టీ20 కెప్టెన్‌ చేయాలని కొంతమంది సూచిస్తుండగా.. మరికొంతమంది పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ పేరును తెరపైకి తెస్తున్నారు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌ స్పందించాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లి తర్వాత టీ20 కెప్టెన్‌గా అర్హుడని అభిప్రాయపడ్డాడు.

‘భారత తదుపరి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ అర్హుడు. ఎందుకంటే అతడికి అవకాశం ఇచ్చినప్పుడల్లా కెప్టెన్‌గా అద్భుతంగా రాణించాడు. 2018లో అతడి కెప్టెన్సీలోనే టీమ్‌ఇండియా ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. అంతేకాకుండా ముంబయి ఇండియన్స్‌ జట్టును కూడా అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు’ అని వెంగ్ సర్కార్‌ చెప్పుకొచ్చాడు. 

‘టీ20 కెప్టెన్‌గా వైదొలగాలని కోహ్లి తీసుకున్న నిర్ణయం నేను ఊహించినదే. అతడు టీమ్‌ఇండియా కెప్టెన్‌గా ఉంటూ దాదాపు ఎనిమిదేళ్లుగా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌ బ్యాట్స్‌మన్‌గా  ఉన్నాడు. విరాట్‌పై ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే అతడు క్రీజులో ఉన్న ప్రతీసారి మంచి ప్రదర్శన ఆశిస్తాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ గెలిచి అతడు కెప్టెన్సీకి ఉన్నతంగా వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నా’ అని వెంగ్ సర్కార్‌ పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని