ధోనీ లాగే కోహ్లీ చేశాడు.. 
close

తాజా వార్తలు

Published : 06/02/2021 08:53 IST

ధోనీ లాగే కోహ్లీ చేశాడు.. 

కావాలంటే వీడియో చూడండి..

చెన్నై: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు మూడో సెషన్‌లో పర్యాటక జట్టు సారథి జోరూట్‌ గాయపడడంతో కోహ్లీ సాయం చేశాడు. గతంలో ఒకసారి దక్షిణాఫ్రికా ఆటగాడికి ధోనీ కాళ్లు పైకెత్తి సాయపడినట్లే విరాట్‌ సైతం రూట్‌కు అదే విధంగా సహాయం చేశాడు.

చెపాక్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శుక్రవారం తొలిరోజు ఆట పూర్తయ్యే ముందు అశ్విన్‌ 87వ ఓవర్‌ వేశాడు. ఆ సందర్భంలో చివరి బంతిని రూట్‌ స్లాగ్‌ స్వీప్‌తో సిక్సర్‌గా మలిచాడు. సరిగ్గా అప్పుడే అతడి కుడికాలి నరం పట్టేసింది. దీంతో నొప్పిని భరించలేక అక్కడికక్కడే కూలబడ్డాడు. ఇంగ్లాండ్‌ టీమ్‌ ఫిజియో వచ్చేలోపు రూట్‌ దగ్గకెళ్లిన కోహ్లీ అతడి కాలును పైకెత్తి పట్టుకున్నాడు. దాంతో ఉపశమనం పొందిన ఇంగ్లాండ్‌ సారథి లేచి కూర్చున్నాడు. ఆ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పంచుకోగా వైరల్‌గా మారింది. 

అయితే, 2015లోనూ దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఇలాగే ప్రత్యర్థి ఆటగాడికి సాయం చేశాడు. అప్పుడు డుప్లెసిస్‌ సిక్స్‌ కొట్టాక కాలు నరం పట్టేయడంతో ఉన్నట్టుండి నేలపైకి ఒరిగాడు. అది గమనించిన ధోనీ వెంటనే అతడి కాళ్లను పైకెత్తి పట్టుకున్నాడు. తర్వాత ఫిజియో వచ్చి పరీక్షించగా కోలుకున్నాడు. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్‌గా మారడంతో అందరూ ధోనీ క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. ఇప్పుడు విరాట్‌ సైతం అదే పని చేసి ప్రశంసలు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండు వీడియోలను జతచేస్తూ బీసీసీఐ అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. 

ఇవీ చదవండి..
వందలో వంద
600-700 కొట్టేయడమే లక్ష్యం: రూట్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని