అఫ్రిదిని ఆకట్టుకున్నది విరాట్‌ ఒక్కడే

తాజా వార్తలు

Published : 05/07/2021 01:06 IST

అఫ్రిదిని ఆకట్టుకున్నది విరాట్‌ ఒక్కడే

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిదిని అమితంగా ఆకట్టుకున్న క్రికెటర్లలో టీమ్‌ఇండియా నుంచి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఉన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా పాక్‌ మాజీ సారథి ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తనని ఎక్కువగా ఆకట్టుకున్న క్రికెటర్లలో ఎవరి ఆటను చూడాలనుకోవడం ఇష్టమని అడిగిన ప్రశ్నకు అతనిలా బదులిచ్చాడు.

‘నా కెరీర్‌ తొలినాళ్లలో ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, సయీద్‌ అన్వర్‌ లాంటి ఆటగాళ్లు అమితంగా ఆకట్టుకున్నారు. టీవీల ముందు కూర్చొని వాళ్ల ఆటను చూసేలా ప్రేరేపించారు. వాళ్లతో కలిసి ఆడినప్పుడు నా కల నెరవేరింది. ఇక నన్ను బాగా ఆకట్టుకున్న విదేశీ క్రికెటర్లలో లారా, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ముందుంటారు. అలాగే ఇప్పటి తరానికి వస్తే.. ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీ, బాబర్‌ అజామ్‌ ఉన్నారు. బాబర్‌ ప్రత్యేకమైన ఆటగాడు. ఫకర్‌ జమాన్‌ కూడాఫామ్‌లో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడతాడు. అతడికి సరైన ఆరంభం లభిస్తే పాక్‌ జట్టుకు ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు. అది జరగాలంటే అతడు నిలకడగా రాణించడం ముఖ్యం’ అని అఫ్రిది తనకిష్టమైన క్రికెటర్ల పేర్లను వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని