విరాట్‌ విలువ.. అందరికన్నా ఎక్కువ

తాజా వార్తలు

Published : 05/02/2021 02:16 IST

విరాట్‌ విలువ.. అందరికన్నా ఎక్కువ

తొలి పది స్థానాల్లో సినీ జంట..

నాలుగోసారి నెంబర్‌ 1గా నిలిచిన కోహ్లీ

 

ముంబయి: కరోనా వైరస్‌ ప్రభావం అత్యధికంగా ప్రకటన, వినోద పరిశ్రమలపై అత్యధికంగా పడింది. పలు సినిమాల నిర్మాణం, విడుదల నిలిచిపోవటం వల్ల సినీ రంగం కుదేలుకాగా.. తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు సంస్థలు ముందుకు రాకపోవటంతో ప్రకటనల రంగం దెబ్బతింది. ఈ రెండూ బ్రాండ్‌విలువతో  సంబంధమున్న రంగాలే. ఐతే జాతీయ స్థాయిలో వ్యక్తిగత బ్రాండ్‌ విలువలను గురించి ఓ తాజా అధ్యయనంలో వెల్లడైన వివరాలు ఆశాజనకంగానే ఉన్నాయి.

2020 సంవత్సరానికి గాను భారత్‌కు చెందిన సెలబ్రిటీల బ్రాండ్‌ విలువలను.. అంతర్జాతీయ గణాంకాల సంస్థ డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ ఇటీవల విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం 237.7 మిలియన్‌ డాలర్లు విలువ చేసే బ్రాండ్‌ ఇమేజ్‌తో  క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, అత్యంత విలువైన సెలబ్రిటీగా తన స్థానాన్ని వరుసగా నాలుగోసారి కూడా నిలబెట్టుకున్నాడు. కొవిడ్‌ కాలంలోనూ టీమిండియా సారధి విలువ చెక్కు చెదరకపోవటం గమనార్హం. తొలి పదిస్థానాల్లో కోహ్లీ కాకుండా మిగిలినవన్నీ సినిమా తారలకే దక్కడం మరో విశేషం. ఇక వీరిలో ఇద్దరు మహిళలకు స్థానం దక్కింది.

118.9 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌విలువతో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తన రెండో స్థానాన్ని నిలుపుకొన్నాడు.

► మూడో స్థానంలో నిలిచింది కూడా మరో బాలీవుడ్‌ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్‌ సింగ్‌. ఇతని బ్రాండ్‌ విలువ 102.9 మిలియన్‌ డాలర్లని సంస్థ లెక్క కట్టింది.

► ఇక కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌.. గత సంవత్సరం కంటే తన రాంకును మెరుగుపర్చుకుని 51.1 మిలియన్‌ డాలర్ల విలువతో నాలుగో స్థానానికి చేరాడు. 

► దేశంలో అత్యంత విలువైన ఐదో సెలబ్రిటీగా, మహిళల్లో తొలిస్థానంలో దీపికా పదుకొణె నిలవటం విశేషం. ఈమె ఇమేజ్‌ 50.4 మిలియన్‌ డాలర్లకు సమానమట. ఐతే ఈమె ఇదివరకటి మూడో స్థానంనుంచి ఈ సంవత్సరం ఐదుకు చేరింది.

► చలాకీ హీరోయిన్‌ ఆలియా భట్‌ 48 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువతో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. గతేడాది ఉన్న ఏడో స్థానం నుంచి ఎగబాకి ఆరుకు చేరుకుంది.
► అంధాధున్‌ చిత్రంతో ఉత్తమ జాతీయ నటుడి అవార్డు గెల్చుకున్న ఆయుష్మాన్‌ ఖురానా ఈసారి తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు.48 మిలియన్‌ డాలర్ల విలువ పలికి.. పదినుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు.
► కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ సారి కాస్త తగ్గి.. ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.. 45 మిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువను సొంతం చేసుకున్నాడు.
► బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ 44.2మిలియన్‌ డాలర్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా.. బాలీవుడ్‌ గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌ 39.4 మిలియన్‌ డాలర్లని తేల్చారు. ఇక టైగర్‌ ష్రాఫ్‌, రోహిత్ శర్మ వరుసగా 15,17 రాంకులతో ముందుకు దూసుకుపోయారు. కుర్ర హీరో కార్తీక్‌ ఆర్యన్‌ 20 స్థానం సాధించి జాబితాలోకి తొలిసారి అడుగుపెట్టాడు.

ఇవీ చదవండి..

వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధర

సౌదీ బాటలో కువైట్‌.. విమానాల నిలిపివేత


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని