ఏబీ డివిలియర్స్ చెప్పిందే చేశా: కోహ్లీ

తాజా వార్తలు

Published : 15/03/2021 10:52 IST

ఏబీ డివిలియర్స్ చెప్పిందే చేశా: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(73 నాటౌట్‌; 49 బంతుల్లో 5x4, 3x6) మునుపటిలా రెచ్చిపోయాడు. ‘కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అనేలా అభిమానులను అలరించాడు. చాలా కాలం తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అయితే, ఇలా పూర్తి సాధికారతతో బ్యాటింగ్‌ చేయడానికి పలు కారణాలున్నాయని మ్యాచ్‌ అనంతరం కోహ్లీ వెల్లడించాడు. అందులో ఒకటి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌తో మాట్లాడినట్లు చెప్పాడు.

‘ఆటలో నేను మళ్లీ ప్రాథమిక అంశాలపై దృష్టిసారించాల్సి వచ్చింది. మరోవైపు అనేక ఇతర ఆలోచనలతో సతమతమవుతున్నా. జట్టు కోసం ఆడమంటే ఎప్పుడూ ముందుంటా. ఈ ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నా. నా బ్యాటింగ్‌ గురించి జట్టు యాజమాన్యం, నా సతీమణి అనుష్క చాలా విషయాలు మాట్లాడారు. నేనేం చేయాలో చెప్పారు. తర్వాత ఈ మ్యాచ్‌కు ముందు డివిలియర్స్‌తో స్పెషల్‌ చాట్‌ చేశాను. అతను బంతిని మాత్రమే చూసి ఆడమని చెప్పాడు. నేను అదే చేశాను’ అని కోహ్లీ వివరించాడు.

ఇక లక్ష్య ఛేదనలో తనతో పాటు అర్థశతకం బాదిన అరంగేట్రం ఆటగాడు ఇషాన్‌కిషన్‌(56; 32 బంతుల్లో 5x4, 4x6)పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్‌లోనే నాణ్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడని, తనకు ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్‌ చేశాడని ఇషాన్‌ను మెచ్చుకున్నాడు. భయం లేకుండా కచ్చితమైన షాట్లతో అలరించాడన్నాడు. ఈ రోజు అతడి నుంచి ఇలాంటి ఎటాకింగ్‌ ప్రదర్శన జట్టుకు అవసరమని కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో 164/6 స్కోర్‌ చేయగా, తర్వాత కోహ్లీ, ఇషాన్‌ జట్టును విజయపథంలో నడిపించారు. మధ్యలో యువ ఓపెనర్‌ ఔటైనా, పంత్‌(26), శ్రేయస్‌(8)తో కలిసి విరాట్‌ మ్యాచ్‌ను గెలిపించాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని