Dhoni - Kohli: అదో ఆత్మీయ అనుబంధం: కోహ్లీ 

తాజా వార్తలు

Updated : 30/05/2021 13:50 IST

Dhoni - Kohli: అదో ఆత్మీయ అనుబంధం: కోహ్లీ 

వసీమ్‌ అక్రమ్‌ ఇబ్బంది పెట్టేవాడు: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అంటే తనకు గౌరవంతో పాటు నమ్మకం అని, తమ ఇద్దరి మధ్యా అలాంటి అనుబంధం ఉందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు ప్రస్తుతం ముంబయిలో క్వారంటైన్‌లో ఉన్న కోహ్లీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అనేక మంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అవేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం..

* సర్‌ క్వారంటైన్‌లో మీ దినచర్య ఎలా ఉంటుందో చెప్పండి..
కోహ్లీ: రోజుకు ఒకసారి ట్రెయినింగ్‌ చేయడం మిగతా సమయం కుటుంబంతో గడపడం. 

వామికా అంటే అర్థమేంటి? తను ఎలా ఉంది.. తన ఫొటోలు చూడొచ్చా?
కోహ్లీ: దుర్గా దేవికి మరో పేరే వామికా. తనకు సామాజిక మాధ్యమాలంటే ఏంటో తెలిసొచ్చేదాకా వాటికి దూరంగా ఉంచాలని మేం నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత తన ఇష్టప్రకారం ఉండొచ్చు.

మీ డైట్‌లో ఏముంటాయ్‌?
కోహ్లీ: కూరగాయలు, గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పప్పు, పాలకూర ఇవన్నీ తింటా కానీ తగిన మోతాదులోనే.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కోహ్లీ: ముఖ్యమైన వాటి గురించే ఆలోచించండి. అలాగే అంతా మంచే జరుగుతుందనే అనుకోండి. ఎప్పుడైనా అది జరగొచ్చనే అభిప్రాయంతో ఉండండి.

గూగుల్‌లో మీరు చివరిసారి దేని గురించి వెతికారు?
కోహ్లీ: క్రిస్టియానో రొనాల్డో గురించి చూశా.

* పాతతరం బౌలర్లలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బౌలర్‌ ఎవరై ఉంటారు?

కోహ్లీ: వసీమ్‌ అక్రమ్‌

మీ గతానికి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని మార్చుకోవాల్సి వస్తే ఏం చేస్తారు?
కోహ్లీ: అలాంటిదేం లేదు..

ఆర్సీబీ లేదా టీమ్‌ఇండియాలో సరదాగా, ఆకట్టుకునేలా, బాగా సిగ్గుపడే ఆటగాళ్ల పేర్లు చెప్పండి..
కోహ్లీ: సరదాగా అంటే చాహల్‌, ఆకట్టుకునే ఆటగాడు డివిలియర్స్‌, బాగా సిగ్గుపడే ఆటగాడు కైల్‌ జేమీసన్‌

టీమ్‌ఇండియా గురించి మీరు పంచుకునే ఒక సీక్రెట్‌ ఏమిటి?
కోహ్లీ: మేమంతా ప్రాంక్‌స్టర్స్‌ బృందం.

మీకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ఎలా స్ఫూర్తిపొందుతారు?
కోహ్లీ: మనం చేసే పనులు సరిగ్గా చేయాలి. ఫలితం గురించి ఆలోచించకుండా వాటికి కట్టుబడి ఉండాలి.

* రోజూ మీరు ఏమేం తింటారు?
కోహ్లీ: చాలా వరకు ఇంట్లో చేసే భారతీయ ఆహారమే తింటాను. అప్పుడప్పుడూ చైనీస్‌ ఫుడ్‌ కూడా తీసుకుంటా. అవికాకుండా ఆల్మండ్స్‌, ప్రొటీన్‌ బార్‌, పండ్లు తింటాను.

* ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జెర్సీతో మీ ఫొటో చూపించండి?
కోహ్లీ: క్షమించండి.. ఇప్పుడు కాదు తర్వాత చూపిస్తాను..

మీరు కన్నడ భాష మాట్లాడి అర్థం చేసుకుంటారా?
కోహ్లీ: కొంచెం మాట్లాడతా కానీ, అస్సలు అర్థం చేసుకోలేను..

* వాక్సినేషన్ తీసుకున్నాక మీకు జ్వరం.. లేదా ఏదైనా ఇతర ఇబ్బందులు ఎదురయ్యాయా?

కోహ్లీ: కొంచెం ఒళ్లు నొప్పులతో పాటు తేలికపాటి జ్వరం వచ్చింది. కానీ పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేవు..

* సర్‌ మీరు విమర్శలను ఇష్టపడతారా లేక పొగడ్తలను ఇష్టపడతారా?

కోహ్లీ: నిర్మాణాత్మకమైన విమర్శలతో పాటు నిజమైన పొగడ్తలను ఇష్టపడతా. అబద్ధాలను అస్సలు పట్టించుకోను.

* మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు?

కోహ్లీ: విశ్రాంతి తీసుకుంటా లేదా అనుష్కతో కలిసి మంచి టీవీ కార్యక్రమాలు వీక్షిస్తా..

* నా హెడ్‌ఫోన్స్‌ ఎక్కడ పెట్టావ్‌ (అనుష్క)

కోహ్లీ: ఎప్పుడూ పెట్టే దగ్గరే.. బెడ్‌ పక్కన ఉండే టేబుల్‌ మీదే పెట్టాను.. అని టీమ్‌ఇండియా సారథి అభిమానుల ప్రశ్నలకు తీరిగ్గా జవాబులిచ్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని