ఏమైంది రోహిత్‌? విరాట్‌ అమాయక ప్రశ్న!
close

తాజా వార్తలు

Updated : 14/02/2021 07:43 IST

ఏమైంది రోహిత్‌? విరాట్‌ అమాయక ప్రశ్న!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ తన భావోద్వేగాలను అస్సలు దాచుకోడు. ఏ మాత్రం సంకోచించకుండా హావభావాలు ప్రదర్శిస్తాడు. ఎలాంటి సందర్భమైనా తన సందేహాలను వ్యక్తం చేయకుండా ఊరుకోడు. కొన్నిసార్లు ఇవి సరదాగా ఉంటాయి. చూసేవారికి నవ్వు తెప్పిస్తాయి. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఔటైనప్పుడు విరాట్‌ ముఖకవళికలు నెటిజన్లను ఆకర్షించాయి.

సాధారణంగా విరాట్‌ డకౌట్‌ అవ్వడం కష్టం. అలాంటిది చెపాక్‌లో మొయిన్‌అలీ వేసిన బంతికి అతడు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 21.2వ బంతిని అలీ విసిరాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పిచైన బంతిని కాస్త ముందుకు వంగి కోహ్లీ డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాటు, ప్యాడ్ల మధ్యలోంచి వెళ్లిన బంతి ఊహించని విధంగా టర్నై బెయిల్స్‌ను కిందపడేసింది. వెంటనే అలీ సంబరాలు చేసుకుంటూ పరుగెత్తాడు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు సైతం అరుస్తూ అతడి వెంటనే పరుగెత్తారు.

ఇదంతా చూసిన కోహ్లీ తాను ఔటయ్యానని నమ్మలేదు. క్షణాల్లో బంతి గింగిరాలు తిరిగి వికెట్లను తాకి బెయిల్స్‌ కిందపడటంతో కీపర్‌ స్టంపౌట్‌ చేసేందుకు ప్రయత్నించాడని భావించాడు. విస్మయానికి గురైనట్టుగా హావభావాలు పలికిస్తూ రోహిత్‌ను ఏమైందని తలపైకి ఊపుతూ అడిగాడు. అతడు ఔటని చెప్పడంతో నమ్మబుద్ధి కానట్టుగానే క్రీజువదిలి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతడి ముఖకవళికలు చూసినవారికి కొంత జాలి, సరదాగా అనిపించడంతో నెటిజన్లు మీమ్స్‌తో పోస్టులు పెడుతున్నారు.

ఇవీ చదవండి
హిట్‌మ్యాన్‌ షో
రోహిత్‌ 97.. రితికా గుండె లబ్‌ డబ్‌

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని