సచిన్, దాదా, వీవీఎస్‌‌.. యోయో పాసయ్యేవాళ్లు కాదు 

తాజా వార్తలు

Updated : 02/04/2021 12:16 IST

సచిన్, దాదా, వీవీఎస్‌‌.. యోయో పాసయ్యేవాళ్లు కాదు 

నైపుణ్యమే ఆటగాళ్ల ఎంపికకకు ప్రామాణికం కావాలి: వీరూ

దిల్లీ: ఫిట్‌నెస్‌ పరీక్ష యో-యోను తమ సమయంలో తప్పనిసరి చేసివుంటే సచిన్‌ తెందుల్కర్, సౌరభ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు పాసయ్యేవాళ్లు కాదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా టీమ్‌ఇండియా ఎంపికకు యో-యో పరీక్షలో పాసవడాన్ని ప్రామాణికంగా నిర్దేశించారు. చాలామంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ పరీక్షలో విఫలమై జట్టులో చోటు కోల్పోయారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు వరుణ్‌ చక్రవర్తి యో-యో పరీక్షలో విఫలమయ్యాడు. బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేని హార్దిక్‌ పాండ్యను టీ20ల్లో ఆడిస్తున్నప్పుడు వరుణ్‌కు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్‌ బదులిస్తూ.. ‘‘పరుగెత్తడంలో హార్దిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే బౌలింగ్‌తో అతనిపై పనిభారం పెరుగుతుంది. మరోవైపు అశ్విన్, వరుణ్‌ యో-యో పరీక్షలో పాసవలేదు. అందుకే ఎంపికవలేదు. అయినా, వీటితో నేను ఏకీభవించను. గతంలో యో-యో పరీక్ష ఉండుంటే సచిన్, లక్ష్మణ్, గంగూలీ వంటి దిగ్గజాలు కూడా పాసయ్యేవాళ్లు కాదు. బీప్‌ పరీక్షలో పాసైనట్లు నేనెప్పుడూ చూడలేదు. వారెప్పుడూ 12.5 మార్కు దగ్గరికి వచ్చేవాళ్లే కాదు. మ్యాచ్‌ ఆడేందుకు సరిపడా ఫిట్‌నెస్‌ ఉంటే చాలు. నైపుణ్యమే ఆటగాళ్ల ఎంపికకకు ప్రామాణికం కావాలి’’ అని సెహ్వాగ్‌ అన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని