virat anushka: ఆ క్షణాలను డబ్బుతో విలువ కట్టలేం

తాజా వార్తలు

Updated : 16/04/2021 18:37 IST

virat anushka: ఆ క్షణాలను డబ్బుతో విలువ కట్టలేం

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి నటి అనుష్కశర్మ జంతు ప్రేమికులు. ముఖ్యంగా శునకాలంటే ఈ జంటకి అమితమైన ప్రేమ. ఆకలితో అలమటించే మూగజీవాలకు ఎన్నోసార్లు ఆహారం అందించి వాటిపై తమ మమకారాన్ని చాటుకుంది విరుష్క జోడీ.

కరోనా కారణంగా గతేడాది చాలాకాలం పాటు క్రికెట్‌ మ్యాచులు, సినిమా షూటింగులు లేకపోవడంతో విరుష్క జోడీ ఇంట్లోనే ఉంటూ సరదాగా గడిపింది. ఆ సమయంలో వీరిద్దరూ తమ పెంపుడు కుక్కలతో ఆడుకునేవారు. అప్పట్లో లాక్‌డౌన్‌ వల్ల దుకాణాలన్నీ మూతపడ్డాయి. వీధుల్లో ఉండే శునకాలకు ఆహారం దొరక్క ఆకలితో అలమటించేవి. ఆ సమయంలో ఈ జంట ఆహార పదార్థాలతోపాటు తమ పెంపుడు కుక్కలను తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లింది. వీరు తీసుకెళ్లిన తిండిని చూసిన శునకాలు వెంటనే దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాయి. విరాట్‌, అనుష్కశర్మ వాటిని స్వయంగా చేతులతో పట్టుకుని ఆహారం అందించారు. 

శునకాలతో గడిపిన ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ‘‘కొన్ని ప్రత్యేకమైనవి. గతేడాది గడిపిన ఆ క్షణాలను డబ్బుతో విలువ కట్టలేం’’ అనే వ్యాఖ్య జత చేస్తూ వీడియోను పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓసారి మీరూ చూసేయండి!



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని