close

తాజా వార్తలు

Published : 09/04/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిరాజ్‌, సుందర్‌ రెచ్చిపోతారు: కోహ్లీ

చెన్నై: టీమ్‌ఇండియాకు ఆడిన ఆత్మవిశ్వాసంతో వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌ వంటి యువకులు ఆర్‌సీబీ తరఫున అదరగొడతారని ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. భారత్‌కు ఆడటం సైని, సుందర్‌, సిరాజ్‌, యూజీ వ్యక్తిత్వాలను మార్చేసిందని పేర్కొన్నాడు. తమ జట్టు సరైన దిశలో పయనించేందుకు, బృందంగా రాణించేందుకు వారి అనుభవం సాయపడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ముంబయితో మ్యాచ్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘మా కుర్రాళ్లు మరింత ఆత్మవిశ్వాసం, అనుభవం పొందారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరు ప్రభావం చూపగలరని ప్రత్యర్థులకూ తెలుసు. ఇది మాకు శుభసూచిక. ఏదేమైనా చిన్నస్వామిలో ఆడినంత మజా ఉండదు. కానీ ఐపీఎల్‌ స్వదేశానికి రావడం సానుకూల అంశం. అయితే ఈసారీ ఎవరికీ సొంతమైదాన ప్రయోజనం లేదు. ప్రతి జట్టు తటస్థ వేదికల్లోనే ఆడుతోంది. సొంత బలాలపై ఆధాపడతారు కాబట్టి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే 3-4 మ్యాచులను కాపాడుకోవాలి. ఇక టోర్నీకి వ్యూయర్‌షిప్‌ పెరగడం గొప్ప విషయం’ అని కోహ్లీ అన్నాడు.

‘గతేడాది పోటీలో మేం నిలబడ్డాం. ఈ సారీ మేం గట్టి పోటీనిస్తామన్న విశ్వాసం ఉంది. కొత్త కుర్రాళ్లు రావడం ఆసక్తికరంగా ఉంది. మాక్స్‌వెల్‌ వచ్చాడు. రిచర్డ్‌సన్‌ చేరాడు. డాన్‌ క్రిస్టియన్, డేనియెల్‌ సామ్స్‌, భారత ఆటగాళ్లూ చేరారు. ఇప్పుడున్న వనరుల పట్ల సంతృప్తిగా ఉంది. తొలి మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. మా కోచ్‌లు ఉపయోగిస్తున్న భాష చాలా బాగుంది. కోచింగ్‌ బృందంలో కొందరు కొత్తవాళ్లు వచ్చినా స్వేచ్ఛను ఇస్తున్నారు’ అని విరాట్‌ తెలిపాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని