Rekha & Imran: పెళ్లికి సిద్ధమైన రేఖ, ఇమ్రాన్‌ ఖాన్‌?
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rekha & Imran: పెళ్లికి సిద్ధమైన రేఖ, ఇమ్రాన్‌ ఖాన్‌?

ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఓ కథనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌.. క్రికెట్‌ది అవినాభావ సంబంధం! ఎందుకంటే ఎంతో మంది బాలీవుడ్‌ అందెగత్తెలు టీమ్‌ఇండియా క్రికెటర్లను ప్రేమించారు. పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనుసాగుతూనే ఉంది.

అయితే ఇది భారత క్రికెట్‌తోనే ఆగిపోలేదు! పాక్‌ మాజీ క్రికెటర్‌, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, బాలీవుడ్‌ అలనాటి ముద్దుగుమ్మ రేఖ పెళ్లి చేసుకోవాలని భావించారట! ప్రస్తుతం ఈ సమాచారంతో కూడిన ఓ కథనం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

ఒకప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ చుట్టూ ఎక్కువగా అందమైన అమ్మాయిలు ఉండేవారని ఇప్పటికీ చెబుతుంటారు. అప్పట్లో భారత్‌, పాక్‌ ఎక్కువగా ద్వైపాక్షిక  క్రికెట్‌ సిరీసులు ఆడేవి. పాక్‌ క్రికెటర్లు సైతం బాలీవుడ్‌ తారలను తరచూ కలుస్తుండేవారు. ఇమ్రాన్‌, రేఖ మాత్రం దాదాపుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వారిద్దరూ బీచులు, ఉద్యానవనాల్లో ప్రేమించుకొనేవాళ్లని ఆ కథనంలో రాశారు.

అందులోనే సినీ తారలతో డేటింగ్‌ గురించి ఇమ్రాన్ అభిప్రాయం ఏమిటో ప్రచురించారు. ‘నటీమణులతో సహచర్యం కొన్నాళ్లే బాగుంటుంది. కొంత వరకు వారితో సాంగత్యాన్ని నేను ఆస్వాదించేవాడిని. ఆ తర్వాత ముందుకెళ్లే వాడిని. అయితే నటిని పెళ్లి చేసుకోవాలని మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు’ అని ఇమ్రాన్‌ అనడం గమనార్హం.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని