Dravid: కారు దిగి పాక్‌ క్రికెటర్‌ను పలకరించి..
close

తాజా వార్తలు

Updated : 11/06/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dravid: కారు దిగి పాక్‌ క్రికెటర్‌ను పలకరించి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ తనతో మాట్లాడేందుకు కారు దిగి రావడం సంతోషకరమని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ యాసిర్‌ అరాఫత్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందన్నాడు. పిలవగానే తన గొంతు విని దగ్గరకు రావడం అతడి హుందాతనమని వెల్లడించాడు.

లార్డ్స్‌ వేదికగా 2014లో జరిగిన టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ రెండో టెస్టుకు ద్రవిడ్‌ వెళ్లాడు. మ్యాచ్‌ ఆరంభంలో గంట మోగించాడు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

‘ఓ మ్యాచ్‌కు వ్యాఖ్యానం చేసేందుకు రాహుల్‌ ద్రవిడ్‌ లార్డ్స్‌కు వచ్చాడు. ఆట ముగిశాక స్టేడియం బయటకు వచ్చి.. కారును పిలిచి అందులోకి ఎక్కబోతున్నాడు. రాహుల్‌ భాయ్‌ అంటూ దూరం నుంచి నేను కేక వేయడంతో ఆగిపోయాడు. నా గొంతు విని కారును పంపించేశాడు. నిజానికి పాక్‌ తరఫున నేనెక్కువగా క్రికెట్‌ ఆడలేదు. అయినప్పటికీ రాహుల్‌ నాతో 10-15 నిమిషాలు మాట్లాడాడు.  నా క్రికెట్‌ కెరీర్‌, కుటుంబం గురించి వివరాలు అడిగాడు. నిజంగా నాకెంతో సంతోషం వేసింది’ అని యాసిర్‌ అరాఫత్‌ అన్నాడు.

అంతర్జాతీయ కెరీర్లో తన తొలి వికెట్‌ రాహుల్‌ ద్రవిడ్‌దే కావడం గొప్ప గుర్తింపని అరాఫత్‌ తెలిపాడు. కౌంటీ క్రికెట్లో రాహుల్‌ స్థానంలోనే తనకు అవకాశం వచ్చిందని గుర్తు తెచ్చుకున్నాడు. ‘2003లో రాహుల్‌ స్కాంట్లాండ్‌ తరఫున కౌంటీ క్రికెట్‌ ఆడేవాడు. వ్యక్తిగత కారణాల వల్ల 2004 ఎడిషన్‌ ఆడలేదు. నిర్వాహకులు అతడి స్థానంలో నన్ను తీసుకున్నారు. పాక్‌ తరఫున నేనాడింది మూడు టెస్టులే. 2007, డిసెంబర్లో భారత్‌పై అరంగేట్రం చేశాను. ఐదు వికెట్ల ఘనత అందుకున్నాను. టెస్టుల్లో రాహుల్‌దే నా తొలి వికెట్‌ కావడం అద్భుతం. నా కెరీర్లోనే తీసిన అత్యంత అమూల్యమైన వికెట్‌ అని చెప్పగలను’ అని అతడు వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని