ఓహో.. ఇందుకేనా రోహిత్‌ ఆడలేదు..! 

తాజా వార్తలు

Published : 13/03/2021 09:13 IST

ఓహో.. ఇందుకేనా రోహిత్‌ ఆడలేదు..! 

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తుది జట్టులో రోహిత్‌ పేరు కనిపించకపోవడంతో అతడికి గాయమైందేమో అనుకున్నారంతా. కానీ, రొటేషన్‌ పద్ధతిలో భాగంగా హిట్‌మ్యాన్‌కు విశ్రాంతినిచ్చారని తర్వాత తెలిసింది. ప్రపంచకప్‌ దిశగా సన్నాహాలు మొదలుపెట్టిన భారత్‌.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించే ఉద్దేశంతో రొటేషన్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌కు రోహిత్‌ను దూరం పెట్టింది. భారత్‌ ఉద్దేశం ఏదైనప్పటికీ.. ఫామ్‌లో ఉన్న రోహిత్‌ దూరం కావడం తొలి మ్యాచ్‌లో భారత్‌కు చేటు చేసింది. రొటేషన్‌లో భాగంగా తర్వాతి మ్యాచ్‌ల్లో మరికొందరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశముంది. రాబోయే మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు ఛాన్సులు రావడం ఖాయం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని