close

తాజా వార్తలు

Published : 17/04/2021 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నటరాజన్‌కు అది ఎందుకు దక్కలేదంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెటర్లకు ఏప్రిల్ 15న బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు ప్రకటించింది. నాలుగు విభాగాల్లో మొత్తం 28 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టులు దక్కాయి. గాయం కారణంగా గతేడాది ఎక్కువ మ్యాచు‌లు ఆడని హార్దిక్‌ పాండ్య ‘ఎ’ గ్రేడ్‌ కాంట్రాక్టు దక్కించుకోవడం విశేషం. జట్టులో అతని ప్రాధాన్యాన్ని గుర్తించి బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మహ్మద్ సిరాజ్‌, శుభమన్‌ గిల్.. ‘సి’ గ్రేడ్‌ కాంట్రాక్టు దక్కించుకున్నారు. 

కాగా.. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా వెళ్లిన నటరాజన్‌.. అనుహ్యంగా టెస్టులు, వన్డేలు, టీ 20ల్లో అరంగేట్రంతోనే సంచలన ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయినా నట్టూకు బీసీసీఐ కాంట్రాక్టు దక్కలేదు. దీనికి ఓ కారణం ఉంది. ఏ ఆటగాడికైనా బీసీసీఐ కాంట్రాక్టు దక్కాలంటే భారత్ తరఫున కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా 10 టీ20 మ్యాచులు ఆడి ఉండాలి. నటరాజన్‌ 1 టెస్టు, 2 వన్డేలు, 4 టీ20లు మాత్రమే ఆడాడు. ఈ కారణంగానే అతడికి బీసీసీఐ కాంట్రాక్టు దక్కలేదు.

ఇక..విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రాలు ‘ఎ+’ గ్రేడ్‌లో యథావిథిగా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.7 కోట్ల వేతనం అందనుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని