కరోనా కష్టాల్లో.. జీవితకాలం గుర్తుండే విజయమిది

తాజా వార్తలు

Published : 29/03/2021 11:06 IST

కరోనా కష్టాల్లో.. జీవితకాలం గుర్తుండే విజయమిది

శెభాష్‌ కోహ్లీసేన! జట్టుపై ప్రశంసల వర్షం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ విజేత ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ గెలవడంతో టీమ్‌ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో.. కొవిడ్‌ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నా.. బయో బుడగలో సాధించిన ఈ విజయం అపురూపమని కీర్తిస్తున్నారు. క్రీడా దిగ్గజాలు, రాజకీయ నాయకులు మొదలుకొని పారిశ్రామిక, సినీ ప్రముఖుల వరకు కోహ్లీసేనను అభినందిస్తున్నారు. ఇక అభిమానులైతే రకరకాల మీమ్స్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఎవరెవరు ఎలా స్పందించారంటే..!

‘గత వందేళ్లలో ఇంతలా ఎప్పుడూ అలిసిపోలేదు! అత్యంత కఠిన పరిస్థితుల్లో కలలుగనే సీజన్‌ ఇది!! ఆస్ట్రేలియాపై 5/6 సిరీస్‌ విజయాలు.. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై 3 ఫార్మాట్లలో విజయ దుందుభి.. కుర్రాళ్లు అదరగొట్టారు’ అని టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నారు.

‘కుర్రాళ్లకు అభినందనలు. జీవితకాలంలోనే అత్యంత కఠిన పరిస్థితుల్లో మీరీ సీజన్‌ ఆడారు. అన్ని ఫార్మాట్లలో గొప్ప విజయాలు సాధించారు. ప్రపంచంలోనే రెండు అత్యుత్తమ జట్లు ఉత్కంఠగా తలపడ్డాయి. అందుకు మీకు వందనం’ అని భారత కోచ్‌ రవిశాస్త్రి ట్వీట్‌ చేశారు.

‘సిరీస్‌ను ఎంతో అద్భుతంగా ముగించారు! సామ్‌ కరన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌. కానీ టీమ్‌ఇండియా గీత దాటేసింది. నాలుగున్నర నెలల సీజన్‌కు తిరుగులేని ముగింపు ఇది. తాము సాధించిన దానికి భారత జట్టు ఎంతగానో గర్వించాలి’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు.

‘మూడుకు మూడూ గెలిచేశాం’ అని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని