ఎ‘కిల్‌’స్టోన్‌ మాయ: మిథాలీసేన 47కే ఆలౌట్‌

తాజా వార్తలు

Published : 05/11/2020 16:58 IST

ఎ‘కిల్‌’స్టోన్‌ మాయ: మిథాలీసేన 47కే ఆలౌట్‌

షార్జా: మహిళల టీ20 ఛాలెంజ్‌ 2020లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచులో స్మృతి మంధానా నేతృత్వంలో ట్రయల్స్‌ బ్లేజర్‌ దుమ్మురేపింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీరాజ్‌ సారథ్యంలోని వెలాసిటీని 15.1 ఓవర్లకు 47 పరుగులకే కుప్పకూల్చింది. టీ20 క్రికెట్లో ప్రపంచ నంబర్‌ బౌలరైన సోఫీ ఎకిల్‌స్టోన్‌ (4/9), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/13), జులన్‌ గోస్వామి (2/13) సమష్టిగా వెలాసిటీని దెబ్బకొట్టారు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ను బుధవారం చిత్తుచేసిన వెలాసిటీ.. ట్రయల్‌ బ్లేజర్స్‌పై అలా ఆడలేదు. ఒక సిక్సర్‌, బౌండరీ బాది జోరుమీదున్న ఓపెనర్‌ షెపాలీ వర్మ (13)ను 2.2వ బంతికే జులన్‌ బౌల్డ్‌ చేసింది. ఆ తర్వాత ఎకిల్‌స్టోన్‌ మాయ చేసింది. జట్టు స్కోరు 19 వద్ద వరుసగా మిథాలీ రాజ్‌ (1), వేద కృష్ణమూర్తి (0)ను పెవిలియన్‌ పంపించి కోలుకోలేని దెబ్బతీసింది. మరికాసేపటికే డేనియెల్‌ వ్యాట్‌ (3)ను జులన్‌ ఔట్‌ చేయడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. నిన్నటి మ్యాచులో విజయం అందించిన సుష్మ వర్మ (1), సున్‌ లూస్‌ (4) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. సుష్మను ఎకిల్‌స్టోన్‌, లూస్‌ను రాజేశ్వరీ ఔట్‌చేశారు. శిఖా పాండే (10) పోరాడే క్రమంలో అనవసరంగా రనౌట్‌ అయింది. కాస్పెరెక్‌ (11) అజేయంగా నిలిచింది. అయితే సుశ్రీ దివ్యదర్శిని (0)ని గైక్వాడ్‌, ఎక్తాబిష్ఠ్‌ (0)ను దీప్తి, జహనారా ఆలమ్‌ (1)ను ఎకిల్‌స్టోన్‌ ఔట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని