David Warner: సాహా.. ఆ గది సంఖ్య318?

తాజా వార్తలు

Published : 04/06/2021 01:08 IST

David Warner: సాహా.. ఆ గది సంఖ్య318?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఓ ప్రశ్న వేశాడు! ‘ఆ గది నంబర్‌ 318?’ అని అడుగుతున్నాడు. ఎందుకంటారా? అతడు సౌథాంప్టన్‌ మైదానం చిత్రాన్ని పంచుకోవడమే కారణం.

ముంబయిలో క్వారంటైన్‌ అయిన టీమ్‌ఇండియా మహిళల, పురుషుల జట్లు ఉదయం ఇంగ్లాండ్‌కు బయల్దేరాయి. ఒకే విమానంలో వీరంతా లండన్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి సౌథాంప్టన్‌ మైదానానికి వెళ్లారు. ఎందుకంటే అక్కడ హోటళ్ల సదుపాయం ఉండటమే కారణం. ఆటగాళ్లంతా తమ తమ గదుల్లోకి వెళ్లాక అక్కడి చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

వికెట్‌ కీపర్ వృద్ధిమాన్‌ సాహా తన గది బాల్కనీలో నిలబడి ఓ సెల్ఫీ తీసుకున్నాడు. అందులో సౌథాంప్టన్‌ మైదానం అందంగా దర్శనమిచ్చింది. ‘ఇది మా గది బాల్కనీ నుంచి కనిపిస్తున్న దృశ్యం. మీకేం అనిపిస్తోంది?’ అని ఓ వ్యాఖ్య పెట్టాడు. దానికి డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. ‘అది రూమ్‌ నంబర్‌ 318?’ అని అడిగేశాడు. ఎందుకంటే గతంలోనూ ఆసీస్‌ అక్కడ ఎన్నో మ్యాచులు ఆడింది. ఇక వార్నర్‌, సాహా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కే ఆడే సంగతి తెలిసిందే.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని