WTC Final: మైదానంలో కోహ్లీ భాంగ్రా స్టెప్పులు.. వైరల్‌
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 15:27 IST

WTC Final: మైదానంలో కోహ్లీ భాంగ్రా స్టెప్పులు.. వైరల్‌

సౌథాంప్టన్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మైదానంలో హుషారుగా ఉంటాడు. ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు ఆటగాళ్లలో జోష్‌ నింపుతుంటాడు. నిజానికి అతడి హావభావాలతోనే కుర్రాళ్లు ఉత్సాహంగా ఉంటారు. కొన్నిసార్లు ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించడమే కాకుండా మైదానంలో స్టెప్పులూ వేస్తుంటాడు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ విరాట్‌ కోహ్లీ సరదాగా కాలు కదిపాడు. పంజాబీ నృత్యమైన భాంగ్రా స్టెప్పులు వేశాడు. మ్యాచ్‌ జరుగుతుండగా అభిమానులు డోలు వాయించారు. ఆ శబ్దాలకు లయబద్ధంగా విరాట్‌ నృత్యం చేశాడు. వెంటనే అభిమానులు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ట్రెండ్‌ అవుతున్నాయి.

ఈ మ్యాచులో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. న్యూజిలాండ్‌ పేసర్లు కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ల్లో బంతులు వేసినా, రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ ఇబ్బంది పెట్టినా నిలకడగా ఎదుర్కొన్నాడు. 44 పరుగులు చేసిన అతడు అర్ధశతకం చేస్తాడనే అంతా భావించారు. అయితే, మూడోరోజు కైల్‌ జేమీసన్‌ వేసిన ఓ ఇన్‌స్వింగ్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 217 పరుగులకు ఆలౌట్‌ కాగా న్యూజిలాండ్‌ 101/2 వద్ద ఉంది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని