WTC Final: నాలుగో రోజు ఆట వరుణుడిదే..
close

తాజా వార్తలు

Published : 21/06/2021 19:53 IST

WTC Final: నాలుగో రోజు ఆట వరుణుడిదే..

వర్షం కారణంగా ఆట రద్దు..

సౌథాంప్టన్‌: టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నాలుగో రోజు ఆట పూర్తిగా నిలిచిపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రెండు సెషన్ల పాటు ఎదురు చూసినా వాతావరణంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం మరోసారి మైదాన పరిస్థితులను గమనించిన అంపైర్లు నాలుగో రోజు స్టంప్స్‌ ప్రకటించారు. దాంతో తొలి రోజు లాగే నేడూ ఆట ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది.

మరోవైపు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులు చేయగా న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట నిలిచే సమయానికి 101/2 స్కోర్‌తో నిలిచింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(12), రాస్‌టేలర్‌(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు కివీస్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(30), డెవాన్‌ కాన్వే(54) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అశ్విన్‌ లాథమ్‌ను ఔట్‌ చేయగా, కాన్వే అర్ధశతకం తర్వాత ఇషాంత్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కన్నా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. మరోవైపు రిజర్వ్‌డేతో కలిపి ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. దాంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే భారత్‌, న్యూజిలాండ్‌ ఇరు జట్లు ట్రోఫీని పంచుకునే వీలుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని