WTC Final: ఐసీసీ నిబంధనలు సరిగ్గాలేవ్: వీవీఎస్‌
close

తాజా వార్తలు

Published : 22/06/2021 11:32 IST

WTC Final: ఐసీసీ నిబంధనలు సరిగ్గాలేవ్: వీవీఎస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ నిబంధనలు సరిగ్గా లేవని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ విమర్శించారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతున్న తీరు అభిమానులను నిరాశ పరిచిందన్నారు. ఛాంపియన్‌షిప్‌ అన్నప్పుడు విజేత ఎవరో తేలాలని పేర్కొన్నారు. నాలుగో రోజు ఆట రద్దు కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐసీసీ నియమాలు సరిగ్గా లేవని నాకనిపిస్తోంది. ఎవరెన్ని చెప్పినా అంతిమంగా విజేత ఎవరో తేల్చాలి. సమయం చాలా ఉండటంతో రోజుకు 90 ఓవర్ల చొప్పున ఐదు రోజుల్లో 450 ఓవర్లు పూర్తవుతాయని భావించా. ఐసీసీ నుంచి ఇదే ఆశించా. పైగా రిజర్వు డే ఉండటంతో ఉత్సాహంగా అనిపించింది. కానీ వర్షం ఇలాగే కురిస్తే రిజర్వుడేతో కలుపుకొనైనా మ్యాచును పూర్తి చేయగలరా అని సందేహం కలుగుతోంది’ అని లక్ష్మణ్‌ అన్నారు.

సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. వరుణుడి వల్ల తొలిరోజు పూర్తిగా మ్యాచ్‌ జరగలేదు. రెండో రోజు 64.4 ఓవర్ల ఆట సాధ్యమైంది. మూడో రోజు భారత్‌ను 217కు ఔట్‌ చేసిన కివీస్‌ 101/2తో నిలిచి పైచేయి సాధించింది. నాలుగోరోజు, సోమవారం నిరంతరాయంగా వర్షం కురవడంతో ఆట మొత్తంగా సాధ్యపడలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని