WTC Final: మరికాసేపైతే టేలర్‌ను ఔట్‌ చేసేవాళ్లం!
close

తాజా వార్తలు

Published : 21/06/2021 10:15 IST

WTC Final: మరికాసేపైతే టేలర్‌ను ఔట్‌ చేసేవాళ్లం!

సోమవారం పైచేయి సాధిస్తామన్న శుభ్‌మన్‌ గిల్‌

సౌథాంప్టన్‌: మరికొన్ని ఓవర్లు వేసుంటే రాస్‌ టేలర్‌ వికెట్‌ తీసేవాళ్లమని టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అన్నాడు. వెలుతురు లేమితో ఆటను త్వరగా ముగించాల్సి వచ్చిందని తెలిపాడు. క్రీజులో ఇంకా నిలదొక్కుకోలేదు కాబట్టి విలియమ్సన్‌, టేలర్‌ను త్వరగానే ఔట్‌ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడో రోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు.

‘డేవాన్‌ కాన్వే వికెట్‌ మాకు అత్యంత కీలకం. మేం రాస్‌టేలర్‌కు మరికొన్ని ఓవర్లు వేసుకుంటే మరో రెండు వికెట్లు దక్కేవని నా అంచనా. క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ విలియమ్సన్‌, టేలర్‌ కొత్తవారే కాబట్టి సోమవారం మేం పైచేయి సాధిస్తాం. గతేడాది మేం న్యూజిలాండ్‌పై ఆడినప్పుడు సన్నద్ధం అయ్యేందుకు ఎక్కువ సమయం దొరకలేదు. మా దృష్టి వన్డేలు, టీ20లపైనే ఉంది’ అని గిల్‌ అన్నాడు.

‘వాస్తవంగా చివరి ఐదు ఇన్నింగ్సుల్లో కివీస్‌పై మేం 250 స్కోరు చేయలేకపోయాం. ఈ టెస్టులోనూ మేం మొదట్లో దృఢంగా నిలబడ్డాం. ఐనా 250+ స్కోరు చేయడంలో విఫలమయ్యాం. బహుశా తర్వాతి ఇన్నింగ్స్‌లోనైనా ఆ స్కోర్‌ చేసేందుకు ప్రయత్నిస్తాం. మూడో రోజు కైల్‌ జేమీసన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మా బౌలర్లపై సంపూర్ణ విశ్వాసం ఉంది. సోమవారం కొత్త రోజు. తాజాగా ఆరంభిస్తాం కాబట్టి పుంజుకోగలమన్న ధీమా ఉంది’ అని శుభ్‌మన్‌ గిల్‌ తెలిపాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఇక మూడోరోజు ఆట ముగిసే సరికి కివీస్‌ 101/2తో నిలిచింది. కేన్‌ విలియమ్సన్‌ (12; బ్యాటింగ్‌), రాస్‌ టేలర్‌ (0; బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. డేవాన్‌ కాన్వే (54) అర్ధశతకం చేయగా టామ్ లేథమ్‌ (30) ఫర్వాలేదనిపించాడు. అశ్విన్‌, ఇషాంత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని