WTC Final: వెలుతురు లేక ఆట నిలిపివేత 
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 21:09 IST

WTC Final: వెలుతురు లేక ఆట నిలిపివేత 

టీమ్‌ఇండియా 134/3.. క్రీజులో కోహ్లీ, రహానె..

సౌథాంప్టన్‌: వెలుతురు లేమి కారణంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రెండోరోజు ఆట కాసేపు నిలిచిపోయింది. ఆకాశం మేఘావృతమవడంతో అంపైర్లు ఆ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి భారత్‌ స్కోరు 58.4 ఓవర్లలో 134/3గా నమోదైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (40; 105 బంతుల్లో 1x4), అజింక్య రహానె(22; 62 బంతుల్లో 3x4) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాసేపటి తర్వాత ఆట తిరిగి ప్రారంభమవ్వగా భారత్‌ 60 ఓవర్లకు 138/3 స్కోర్‌ సాధించింది. కోహ్లీ, రహానె అర్ధశతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని