WTC Finals: రిషభ్‌ పంతే సరైనోడు: సాహా

తాజా వార్తలు

Published : 22/05/2021 01:28 IST

WTC Finals: రిషభ్‌ పంతే సరైనోడు: సాహా

ఇంటర్నెట్ డెస్క్: మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌లో భారత జట్టు వికెట్ కీపర్‌గా ఉండటానికి రిషభ్ పంత్‌ సరైనోడని  వృద్ధిమాన్‌ సాహా అభిప్రాయపడ్డాడు.  గత కొంత కాలంగా పంత్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, ఇంగ్లాండ్‌ పర్యటనలో మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండటానికి రిషబ్‌ అర్హుడని సాహా పేర్కొన్నాడు.

‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో రిషభ్ పంత్ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. వాటిల్లో పంత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో అతడు మా మొదటి ప్రాధాన్యత వికెట్ కీపర్‌గా ఉండాలి. నేను వేచి ఉంటా. ఒకవేళ అవకాశం వస్తే నా శక్తి మేరకు పరుగులు చేస్తా. ఆ ఒక్క అవకాశం కోసం ప్రాక్టీస్‌  చేస్తూనే ఉంటా’అని వృద్ధిమాన్‌ అన్నాడు.

‘పరిస్థితులతో సంబంధం లేకుండా  నేను నాలానే ఉండటానికి ప్రయత్నిస్తా. బాగా ఆడినా, ఆడకపోయినా నాలో ఎలాంటి మార్పు ఉండదు. నా చుట్టూ ఉన్న ఇతరులు ఏదైనా భిన్నంగా గుర్తించారో లేదో తెలీదు. ఎప్పుడూ మంచి ఆడటానికే ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు మంచి ప్రదర్శన చేస్తాం. మరికొన్ని సార్లు అది సాధ్యం కాకపోవచ్చు. అన్ని అంశాలను ఆధారంగా చేసుకుని యాజమాన్యం తుదిజట్టును ఎంపిక చేస్తుంది’ అని సాహా పేర్కొన్నాడు.

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ జరగనుంది. ఈ పోరులో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.  అనంతరం ఇంగ్లాండ్‌తో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో వికెట్‌ కీపర్లుగా రిషభ్ పంత్‌,వృద్ధిమాన్‌ సాహా ఎంపికయ్యారు. అయితే,  సాహా ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాహాకు స్టాండ్ బై ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్‌ని ఇంగ్లాండ్‌ పంపనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని