WTC Final: తొలి రోజు ఆట రద్దు 
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 20:07 IST

WTC Final: తొలి రోజు ఆట రద్దు 

వర్షం కారణంగా ఆట నిలిపివేత

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలిరోజు ఆట నిలిచిపోయింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో శుక్రవారం తొలిరోజు ఆట సగం రోజు వరకు సాగలేదు. తొలుత తొలి సెషన్‌ వరకు వేచి చూడగా, భోజన విరామం అనంతరం సైతం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ క్రమంలోనే వరుణుడు కాస్త కనికరించినా.. మైదానమంతా వర్షం నీరు ఉండటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. రేపటి నుంచి మ్యాచ్‌ సజావుగా సాగితే తొలిరోజు కోల్పోయిన సమయాన్ని రిజర్వ్‌డే రోజు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఐసీసీ ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను  ఇంగ్లాండ్‌లో నిర్వహించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు. రెండు బలమైన జట్ల మధ్య హోరాహోరీగా సాగే మ్యాచ్‌ను చూద్దామని ఆశించిన వారికి వరుణుడు నిరుత్సాహం కలిగించాడు. జూన్‌లో అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి కూడా ఐసీసీ మ్యాచ్‌ నిర్వహించడం సరికాదని పోస్టులు పెడుతున్నారు.










Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని