WTC Finals: టెస్టు క్రికెట్లో ప్రపంచకప్‌: పూజారా
close

తాజా వార్తలు

Published : 26/05/2021 01:17 IST

WTC Finals: టెస్టు క్రికెట్లో ప్రపంచకప్‌: పూజారా


(photo:Cheteshwar Pujara Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: సుదీర్ఘమైన ఫార్మాట్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ)ని... ఐసీసీ ప్రపంచ కప్‌తో పోల్చాడు టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్ పూజారా. ‘ఇది మనందరి కల. నిజం చెప్పాలంటే టెస్టు ఫార్మాట్‌లో డబ్ల్యూటీసీ అనేది  ప్రపంచకప్‌. మేమంతా ఈ ట్రోఫీని గెలవాలనుకుంటున్నాం. ఇది మా అందరికీ ముఖ్యమైన మ్యాచ్‌. ఎందుకంటే ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా కష్టపడ్డాం. ప్రతి టెస్టు సిరీస్‌ మాకు ముఖ్యమైనదే. అదే మమ్మల్ని డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చింది. ఈ జట్టు తన శక్తేంటో ఇది వరకే నిరూపించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా రాణిస్తున్నట్టుగానే డబ్ల్యూటీసీ ఫైనల్‌లోను రాణిస్తామనే నమ్మకంతో ఉన్నాం’ అని పూజారా అన్నాడు. సౌథాంప్టన్ వేదికగా జూన్‌ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ జరగనుంది. ఈ పోరులో భారత్, న్యూజిలాండ్‌ తలపడనున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని