close

తాజా వార్తలు

Published : 08/04/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రికెటర్లకు ఎడతెగని పీడకల ఇది!

22వ సారి భారత్‌కు వచ్చానన్న మాక్సీ

చెన్నై: వరుసగా బయో బుడగలకు పరిమితం అవ్వడం క్రికెటర్లకు ఎడతెగని పీడకలగా మారిందని ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అంటున్నాడు. తమ కర్తవ్యం నిర్వర్తించేందుకు ఆటగాళ్లు ప్రస్తుతం సంక్లిష్టమైన జీవనశైలి గడుపుతున్నారని పేర్కొన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యూట్యూబ్‌ ఛానల్‌తో అతడు మాట్లాడాడు.

బయటి ప్రపంచంతో క్రికెటర్లు సాధారణ సంభాషణను మర్చిపోవాల్సిందేనని మాక్సీ ఆవేదన వ్యక్తం చేశాడు. బుడగలు మానసిక ఆరోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయని తెలిపాడు. అభిమానులను రంజింపజేసేందుకు తిరిగి క్రికెట్‌ ఆడుతుండటం మాత్రం సంతోషకరమని వెల్లడించాడు. ఏదేమైనా తమ జీవనశైలి మాత్రం ఇబ్బందికరంగా ఉందని స్పష్టం చేశాడు. ఇది అనుబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలిపాడు. ఈ గడ్డుకాలంలో మనకు మద్దతునిచ్చే నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవాలని సూచించాడు. కొన్నిరోజులు కాబోయే భార్యతో గడిపిరావడంతో మానసికంగా బాగున్నానని వెల్లడించాడు.

గతేడాది పంజాబ్‌కు ఆడిన మాక్సీని ఈ సారి బెంగళూరు రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తాను ధర గురించి పట్టించుకోవడం లేదని, కోహ్లీ, డివిలియర్స్‌తో కలిసి ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని మాక్సీ తెలిపాడు. ‘వారితో కలిసి ఆడాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. మైదానం ఆవల వారి గురించి తెలుసు. వారిపై కొన్ని మ్యాచులూ ఆడాను. ఎట్టకేలకు ఒకే జట్టులో కలిసి ఆడే అవకాశం వచ్చింది’ అని పేర్కొన్నాడు.

‘నాపై ఫ్రాంచైజీలకు కొంత ఆసక్తి ఉందని తెలుసు. చాలా జట్లు మిడిలార్డర్లో ఆడే విదేశీ ఆటగాళ్లను తీసుకున్నాయి. కొన్ని జట్లకు బ్యాటింగ్‌ చేసే ఆఫ్‌ స్పిన్నర్‌ అవసరముందని గ్రహించా. రెండు జట్లు నాకోసం పోటీపడటం, ఆర్‌సీబీ దక్కించుకోవడం సంతోషంగా అనిపించింది. ప్రదర్శనల పరంగా నాకేమీ ఇబ్బంది లేదు. నేనెప్పుడూ సానుకూలంగానే ఉంటాను. అవసరమైతే విరాట్‌కు సాయం చేస్తా. ఎందుకంటే భారత్‌కు రావడం నాకిది 22వ సారి. ఇక్కడి పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన ఉంది. కొత్త జట్టు, కొత్త మనుషులతో కలిసి ఆడుతున్నందుకు ఆసక్తిగా ఉంది. జట్టులో సంతోషాన్ని నింపాలనే అనుకుంటున్నా’ అని మాక్సీ తెలిపాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని