Covid:కరోనా నుంచి కోలుకున్న చాహల్ తల్లిదండ్రులు
close

తాజా వార్తలు

Published : 11/06/2021 00:03 IST

Covid:కరోనా నుంచి కోలుకున్న చాహల్ తల్లిదండ్రులు

(photo:Yuzvendra Chahal Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని చాహల్ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.‘మాకు మద్దతుగా నిలిచి ప్రార్థనలు చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.మీ ప్రార్థనల వల్ల నా తల్లిదండ్రులు కొవిడ్‌-19 నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు.ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండాలని మేం కోరుకుంటున్నా’అనే వ్యాఖ్యను జతచేస్తూ కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశాడు.

చాహల్ తల్లిదండ్రులు మే 3న కొవిడ్ బారినపడ్డారు. ఈ వార్త వినగానే ఐపీఎల్‌కు కొన్ని రోజులు దూరంగా ఉండాలని భావించినట్లు చాహల్ గతంలో వెల్లడించాడు. అయితే, బయోబుడగలోని ఆటగాళ్లు,సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారినపడటంతో ఐపీఎల్‌ను బీసీసీఐ వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ మే 4న ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చాహల్ కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతున్నాడు.

మరోవైపు, సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య  భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌తోపాటు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టులకు చాహల్ ఎంపికకాలేదు. జులైలో శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20లకు ఎంపిక చేసే జట్టులో చాహల్ చోటు దక్కే అవకాశముంది.

 


 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని