close
రజతమే.. అయినా ఘనమే

ఫైనల్లో ఓడిన అమిత్‌
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అమిత్‌ పంగాల్‌  (52 కేజీలు) అద్వితీయ పోరాటానికి తెరపడింది.. అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన అతను.. చివరి బౌట్లో ప్రత్యర్థికి తలవంచాడు. సాధించింది రజతమే అయినా.. ఇది గొప్ప ఘనతే. ఇప్పటిదాకా మరే బాక్సర్‌ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో కాంస్యానికి మించిన పతకం గెలవలేదు. ఫైనల్లో ఓడినా.. టోర్నీలో అమిత్‌ ప్రదర్శన చిరస్మరణీయం.

ఎక్తరీన్‌బర్గ్‌ (రష్యా)

భారత యువ బాక్సర్‌ అమిత్‌ జైత్రయాత్ర పసిడికి అడుగు దూరంలో నిలిచిపోయింది. అతని పంచ్‌ బంగారు పతకాన్ని ముద్దాడలేకపోయింది. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్లో అమిత్‌ 0-5 తేడాతో 2016 లండన్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత షఖోబిదిన్‌ జోరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో పరాజయం చెందాడు. ఛాంపియన్‌షిప్‌ ఆరంభం నుంచి బలమైన పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపించి తుదిపోరుకు చేరిన అతను.. టైటిల్‌ పోరులో వెనకబడ్డాడు. ప్రత్యర్థి ధాటికి తట్టుకోలేకపోయాడు. తనకంటే మెరుగైన ప్రత్యర్థి కచ్చితత్వంతో కూడిన పంచ్‌లతో విరుచుకుపడుతుంటే అమిత్‌ వాటిని కాచుకోవడానికి పరిమితమైపోయాడు. రక్షణాత్మకంగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడు పంచ్‌లు ప్రయోగించినా కూడా అవి ప్రత్యర్థిపై బలంగా పడలేదు. దాంతో 23 ఏళ్ల అమిత్‌ రజతానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇదివరకే మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు) కాంస్యం నెగ్గడంతో భారత్‌.. ఈ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి ఒకటి కంటే ఎక్కువగా పతకాలు సాధించింది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.