close

ధనుష్‌కు స్వర్ణం 

ఖేలో ఇండియా యూత్‌ క్రీడల షూటింగ్‌

పుణె: ఖేలో ఇండియా యూత్‌ క్రీడల షూటింగ్‌లో తెలంగాణ కుర్రాడు ధనుష్‌ శ్రీకాంత్‌ మెరిశాడు. అండర్‌-21 బాలుర 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో ధనుష్‌ 629.9 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. యశ్‌ యోగేశ్‌ (627.9- గోవా) ద్వితీయ, అర్జున్‌ (623.2- పంజాబ్‌) తృతీయ స్థానాల్లో నిలిచారు. గగన్‌ నారంగ్‌కు చెందిన గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీలో ఖేలో ఇండియా పథకం కింద ధనుష్‌ శిక్షణ తీసుకుంటున్నాడు.


 

సాహితికి కాంస్యం: ఖేలో ఇండియా క్రీడల వెయిట్‌ లిఫ్టింగ్‌లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ క్రీడాకారిణి సాహితి కాంస్య పతకం సాధించింది. 59 కేజీల విభాగంలో స్నాచ్‌లో 65 కిలోలు, క్లీన్‌+జెర్క్‌లో 78 కిలోలు కలిపి మొత్తం 143 కిలోల బరువులెత్తిన సాహితి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.