close

విజృంభించిన కార్తికేయ 

హైదరాబాద్‌ ఘన విజయం 
కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ క్రికెట్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు అదరగొట్టింది. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తాచాటిన హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో జార్ఖండ్‌పై ఘన విజయం సాధించింది. 236 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జార్ఖండ్‌.. కార్తికేయ (4/84) ధాటికి 291 పరుగులకు ఆలౌటైంది. సుర్వార్‌ (168; 205 బంతుల్లో 22×4, 5×6) జట్టును ఆదుకొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కార్తికేయతో పాటు రాజమణి ప్రసాద్‌ (2/54), తనయ్‌ త్యాగరాజన్‌ (2/62) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో ఓపెనర్లు నితేశ్‌ రెడ్డి (39 నాటౌట్‌), తిలక్‌ వర్మ (21 నాటౌట్‌) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్‌లో కార్తికేయ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో జార్ఖండ్‌ 152 పరుగులకు కుప్పకూలగా.. బదులుగా హైదరాబాద్‌.. తిలక్‌ వర్మ (160), శశిధర్‌ రెడ్డి (134) శతకాల సాయంతో 388/8తో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో హైదరాబాద్‌ ఖాతాలో ఏడు పాయింట్లు చేరాయి.

జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 152 (రహిల్‌ రెయాజ్‌ ఖాన్‌ 50, రాజమణి ప్రసాద్‌ 3/53, కార్తికేయ 3/36, అబ్దుల్‌ ఖురేషి 3/30), హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 388/8 డిక్లేర్డ్‌ (తిలక్‌ వర్మ 160, శశిధర్‌ రెడ్డి 134, సోను కుమార్‌ సింగ్‌ 4/96), జార్ఖండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 291 (సుర్వార్‌ 168, కార్తికేయ 4/84, రాజమణి ప్రసాద్‌ 2/54, తనయ్‌ త్యాగరాజన్‌ 2/62), హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌: 60/0 (నితేశ్‌ రెడ్డి 39 నాటౌట్‌, తిలక్‌ వర్మ 21 నాటౌట్‌)

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.