close

ఛాంపియన్‌ డెక్కన్‌ క్లబ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ క్లబ్‌ అంతర్‌ క్లబ్‌ల టీ20 క్రికెట్‌ టోర్నీలో డెక్కన్‌ క్లబ్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో డెక్కన్‌ క్లబ్‌ 6 వికెట్ల తేడాతో సికింద్రాబాద్‌ క్లబ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సికింద్రాబాద్‌ క్లబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. మిఖిల్‌ జైశ్వాల్‌ (44), మెరిశాడు. అనంతరం డెక్కన్‌ క్లబ్‌ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు సాధించింది. శేషగిరి (డెక్కన్‌ క్లబ్‌)కి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డులు దక్కాయి. ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా యుదిశ్‌ (జేహెచ్‌ఐసీ), ఉత్తమ బౌలర్‌గా శ్రవణ్‌ (సికింద్రాబాద్‌ క్లబ్‌) అవార్డులు గెలుచుకున్నారు.

సికింద్రాబాద్‌ క్లబ్‌: 122/8 (మిఖిల్‌ జైశ్వాల్‌ 44, గజానంద్‌రెడ్డి 27, అర్జున్‌ 3/14, స్వరూప్‌ 2/29, చైతన్య 1/22), డెక్కన్‌ క్లబ్‌: 125/4 (శేషగిరి 39, వెంకట్‌ 24, పరమ్‌వీర్‌సింగ్‌ 23, చైతన్య 20, తనయ్‌ త్యాగరాజన్‌ 2/22, మిఖిల్‌ జైశ్వాల్‌ 1/2, అక్షత్‌ 1/30)

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.