close

మెరిసిన వంశీ, వినయ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఏపీసీఎస్‌ ఆటగాళ్లు వంశీ మోహన్‌ రెడ్డి (80; 83 బంతుల్లో 8×4, 1×6) బ్యాటింగ్‌లో, వినయ్‌ కుమార్‌ (5/8) బౌలింగ్‌లో చెలరేగారు. దాంతో ఆదివారం జరిగిన హెచ్‌సీఏ ఎ- డివిజన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఏపీసీఎస్‌ 95 పరుగుల తేడాతో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జట్టుపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఎపీసీఎప్‌ వంశీ మెరుపులతో 29.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో వంశీ మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ ఘోరంగా విఫలమయ్యారు. అతనొక్కటే పోరాడే జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అశోక్‌ (6/29) ఆరు వికెట్లతో విజృంభించాడు. అనంతరం ఛేదనలో వినయ్‌ కుమార్‌ ధాటికి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ 20.1 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో అంకిత్‌ (30) టాప్‌ స్కోరర్‌. వినయ్‌తో పాటు ప్రభు (2/15) రాణించి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.