close
భారత్‌-ఎ, లయన్స్‌ మ్యాచ్‌ డ్రా

వాయంద్‌: భారత్‌-ఎ, ఇంగ్లాండ్‌ లయన్స్‌ మధ్య తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగుల లోటుతో ఓవర్‌నైట్‌ స్కోరు 20/0తో ఆదివారం ఆట ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ లయన్స్‌.. మ్యాచ్‌ నిలిపి వేసే సమయానికి 214/5 స్కోరు చేసింది. హిన్‌ (57), పోప్‌ (63) అర్ధసెంచరీలు చేశారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులు చేయగా.. భారత్‌-ఎ 540/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఈ సిరీస్‌లో ఆఖరిదైన రెండో టెస్టు బుధవారం ప్రారంభం కానుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.